Viral: వామ్మో! టెస్లా రూపొందించిన ఈ మనిషి లాంటి రోబోను చూశారా..
ABN , Publish Date - Dec 13 , 2024 | 10:54 PM
టెస్లా రూపొందించిన ఆప్టిమస్ రోబో ఏటవాలుగా ఉన్న నేలపై పడుతూలేస్తూ నడవడం నేర్చుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్ వాహనాల రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన సంస్థ టెస్లా. ఎలాన్ మస్క్ సారథ్యంలో టెస్లా కార్లు వినియోగదారుల విశ్వాసాన్ని చూడగొన్నాయి. అయితే, టెస్లా కేవలం విద్యుత్ కార్లకే పరిమితం కాలేదు. మనుషులను పోలిన రోబోను తయారు చేయడంలో కూడా నిమగ్నమైంది. సంస్థ రూపొందించిన ఆప్టిమస్ ఇప్పటికే అనైన మైలురాళ్లు దాటింది. తాజాగా ఈ రోబో చేసిన మరో అద్భుతం ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది (Viral).
Viral: ఏం క్రియేటివిటీ! ఇది ఆధార్ కార్డు అనుకుంటే పప్పులో కాలేసినట్టే..
తాజాగా షేర్ చేసిన వీడియోలో ఆప్టిమస్.. ఏటవాలుగా ఉన్న నేలపై తనంతట తానుగా మనిషిలాగానే నడిచి అబ్బుర పరిచింది. తొలుత పడుతూ లేస్తూ నడిచి ఆ మరో ప్రయత్నంలో అలవోకగా ఏటవాలుగా ఉన్న నేలపైకి ఎక్కేసింది. అయితే, నడిచే క్రమంలో రోబో మొదట్లో కాస్త బ్యాలెన్స్ తప్పి కిందపడబోయింది. ఆ తరువాత తనను తానే తేరుకుని మళ్లీ కోలుకుంది.
Viral: వామ్మో.. ఈ అడల్ట్ డైపర్స్ ధర రూ.6 వేలు! ఎందుకో తెలిస్తే..
కాగా, ఈ వీడియో జనాలకు అమితంగా నచ్చింది. అచ్చు మనిషిలాగా తడబడటం ఆ తరువాత తేరుకుని మళ్లీ మామూలవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఏఐ సాంకేతికతతో నడిచే ఈ రోబో ఏదోక రోజు మనిషిలాగే అన్ని పనులూ చకచకా చేసేస్తుందని అన్నారు. మరికొందరు మాత్రం సెటైర్లు పేల్చారు. తెల్లవారు జామున లేస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఈ రోబో పరిస్థితి కూడా అలాగే ఉందని కొందరు అన్నారు.
Viral: కస్టమర్ ఆగ్రహం! కొత్త కారుతో షోరూమ్‌ను ఢీకొట్టిన వైనం!
కాగా, న్యూరల్ నెట్స్ సాయంతో ఈ రోబో ఇలా ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో నడవడం నేర్చిందని మస్క మరో పోస్టులో పేర్కొన్నారు. ఇక టెస్లాకు ఈ రోబోట్లే ప్రధాన ఆదాయవనరుగా మారతాయని మస్క్ రెండేళ్ల క్రితమే ఆశాభావం వ్యక్తం చేశారు. మనుషులు సాధారణంగా చేసే పనులన్నీ చేసేందుకు ఈ హ్యుమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. రెండు కాళ్లపై మనిషిలాగే ఈ రోబోపై ఇప్పటివరకూ శాస్త్రజ్ఞుల్లో మిశ్రమ స్పందనే వస్తోంది.
Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు