Viral: పోలీసుల దెబ్బకు ఆడీ కారులో హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్న వ్యక్తి.. అసలు కథేంటో తెలిస్తే..
ABN , Publish Date - May 16 , 2024 | 03:41 PM
ఆ వ్యక్తిది ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా. అతడికి ఆడీ కారు ఉంది. గత నెల రోజులుగా అతడు హెల్మెట్ పెట్టుకుని మాత్రమే కారు నడుపుతున్నాడు. హెల్మెట్ లేకుండా కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం లేదు. అదేంటి.. కారు నడిపేటపుడు హెల్మెట్ ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా?
ఆ వ్యక్తిది ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లోని ఝాన్సీ జిల్లా. అతడికి ఆడీ కారు (Audi Car) ఉంది. గత నెల రోజులుగా అతడు హెల్మెట్ (Helmet) పెట్టుకుని మాత్రమే కారు నడుపుతున్నాడు. హెల్మెట్ లేకుండా కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం లేదు. అదేంటి.. కారు నడిపేటపుడు హెల్మెట్ ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? ఆ వ్యక్తి అలా హెల్మెట్ పెట్టుకుని కారు నడపడం వెనుక ఓ కారణముంది. విషయం తెలుసుకుని మీడియా ఆరా తీయడంతో అసలు సంగతి బయటకు వచ్చింది (Viral News).
ఝాన్సీకి చెందిన బహదూర్ సింగ్ అనే వ్యక్తికి గత మార్చి నెలలో ఓ మెసేజ్ వచ్చింది. హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నందుకు వెయ్యి రూపాయలు జరిమానా (Fine) విధిస్తున్నట్టు తెలియజేస్తే ఓ మెసేజ్ అతడి మొబైల్‌కు వచ్చింది. దీంతో బహదూర్ షాకయ్యాడు. ఎందుకంటే బహదూర్ ఈ మధ్య కాలంలో బైక్ నడపలేదు. ఏదో పొరపాటును వచ్చి ఉంటుందనుకుని స్థానిక ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేశాడు. అందులో తన ఆడీ కారు నెంబర్‌తోనే చలానా ఉంది. అంతేకాదు చలానాలో స్పష్టంగా మోటార్ కార్ అని రాసి ఉంది.
కారు నడిపేటపుడు హెల్మెట్ లేకపోయినా జరిమానా వేస్తున్నారా అని ఆశ్చర్యపోయాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్వాకంపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పది మందికీ ఆ విషయాన్ని తెలియజేయాలని కారులో కూడా హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నాడు. స్థానిక వ్యక్తి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మీడియా ప్రతినిధులు సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: డీజిల్‌తో పరాటా చేయడం చూశారా? వైరల్ వీడియోపై రెస్టారెంట్ ఓనర్ రియాక్షన్ ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..