Share News

Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!

ABN , Publish Date - Sep 22 , 2024 | 06:30 PM

తనకు తెలీకుండా 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నట్టు గుర్తించిన ఓ అమెరికా వ్యక్తి ఆశ్చర్యపోయారు. చివరకు ఫిర్యాదు చేయడంతో విద్యుత్ పంపిణీ సంస్థ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!

ఇంటర్నెట్ డెస్క్: కరెంట్ బిల్లుల విషయంలో ఎవరైనా అప్రమత్తంగా ఉంటారు. ఒక నెలలో బిల్లు పెరిగితేనే టెన్షన్ పడిపోతారు. ఖర్చులు తగ్గించుకునేందుకు విద్యుత్ వినియోగం తగ్గించేస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఫలితం లేదంటే ఏదో తేడా ఉన్నట్టు అనుమానించాలి. అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి సరిగ్గా ఇదే అనుమానం మొదలైంది. చివరకు విద్యుత్ పంపిణీ సంస్థకు ఫిర్యాదు చేస్తే షాకింగ్ విషయంలో వెలుగులోకి వచ్చింది. గత 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు ఖర్చు తన బిల్లులో కలుస్తోందని తెలిసి అతడు షాకైపోయాడు (Viral).

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?


కాలిఫోర్నియాలోని వాకావిల్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తి చాలా కాలంగా తన విద్యుత్ బిల్లులు పెరుగుతుండటంతో టెన్షన్ పడిపోయాడు. ఖర్చులు తగ్గించుకునేందుకు పొదుపు మంత్రం పఠించాడు. అయినా, ఫలితం లేకపోయింది. దీంతో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఆయన మరో వ్యూహం పన్నాడు. విద్యుత్ వినియోగాన్ని లెక్కించే మరో యంత్రాన్ని తన ఇంటికి అమర్చుకున్నాడు. దీంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కరెంట్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో కూడా బిల్లు వస్తున్నట్టు గుర్తించి వెంటనే విద్యుత్ పంపిణీ సంస్థకు ఫిర్యాదు చేశారు.

Legal Awareness: భారతీయ మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టాప్ 5 చట్టాలు!


సదరు సంస్థ తన సిబ్బందిని బాధితుడికి ఇంటికి పంపించి తనిఖీ చేయించింది. చివరకు అసలేం జరిగిందనేది వెలుగులోకి వచ్చింది. పక్కింటి వ్యక్తి కరెంట్ బిల్లు కూడా బాధితుడి మీటర్ నెంబర్‌కు జత చేస్తుండటంతో అతడి బిల్లులు తడిసి మోపెడవుతున్నట్టు విద్యుత్ అధికారులు తేల్చారు. 2009 నుంచీ ఇలా జరుగుతూ ఉండొచ్చని చెప్పారు. తప్పు జరిగిందని అంగీకరించిన వారు దిద్దుబాటు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, వినియోగదారులందరూ ఒకసారి తమ కరెంట్ బిల్లులు తనిఖీ చేసుకోవాలని సూచించారు. దీంతో, ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్ అవుతోంది.

Viral: ఢిల్లీలో పర్యటిస్తూ భారత్‌పై బ్రిటీషర్ అవాకులు చవాకులు! వీడియో వైరల్

Read Latest and Viral News

Updated Date - Sep 22 , 2024 | 06:30 PM