Viral Video: గీజర్గా మారిన పొయ్యి.. ఓ వైపు వంట చేస్తుంటే.. మరోవైపు వేడినీరు ఎలా వస్తుందో చూడండి..
ABN , Publish Date - Jan 04 , 2024 | 05:36 PM
కొందరు సాధారణానికి భిన్నంగా ఆలోచిస్తూ.. కళ్ల ముందున్న వస్తువులతోనే అద్భుతాలు చేస్తుంటారు. ఇంకొందరు దేనికీ పనికిరావు అనుకున్న వస్తువులను సరికొత్తగా మార్చి వినియోగంలోకి తెస్తుంటారు. ఇలాంటి...
కొందరు సాధారణానికి భిన్నంగా ఆలోచిస్తూ.. కళ్ల ముందున్న వస్తువులతోనే అద్భుతాలు చేస్తుంటారు. ఇంకొందరు దేనికీ పనికిరావు అనుకున్న వస్తువులను సరికొత్తగా మార్చి వినియోగంలోకి తెస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టిట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పొయ్యినే గీజర్గా మార్చాడు. ఓ వైపు వంట చేస్తుంటే.. మరోవైపు వేడి నీరు కూడా వస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి కట్టెల పొయ్యి (wood stove ) మీద రొట్టెలు కాలుస్తుంటాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. పొయ్యి తయారు చేసిన విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పొయ్యిని ఇనుప రేకులతో గీజర్ (Geyser) తరహాలో వినియోగించేందుకు గుండ్రటి ఆకారంలో తయారు చేశారు. ఇనుప రేకుల మధ్యలో కొంచెం ఖాళీ స్థలం ఉంచి.. దానికి రెండు వైపులా కొళాయి తరహాలో పైపులను ఏర్పాటు చేశారు.
పొయ్యి మండగానే.. పైపుల్లో ఓ వైపు నీరు పోయగా.. మరో వైపు ఉన్న పైపు నుంచి వేడి నీరు బయటికి వస్తోంది. ఇలా ఒకే పని చేస్తూ రెండు లాభాలు పొందుతున్నారు. ఈ వినూత్నమైన పొయ్యిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘వావ్! ఈ పొయ్యి చాలా అద్భుతంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇది పొయ్యి లాంటి గీజర్’’.. అంటూ మరికొందరు, ‘‘ఎలా వస్తాయయ్యా.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 98వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: డెలివరీ బాయ్ ముందే ఫోన్ అన్‌బాక్స్ చేయగా షాకింగ్ సీన్.. రూ.27వేల ఫోన్ ఆర్డర్ చేస్తే..