Share News

Viral: తన కొడుకు హోం వర్క్ విషయమై స్కూల్‌కు పదే పదే ఫోన్లు.. తండ్రి అరెస్టు

ABN , Publish Date - Mar 28 , 2024 | 05:31 PM

కుమారుడికి హోం వర్క్ ఎక్కువగా ఇస్తున్నారంటూ స్కూల్‌కు, పోలీసులకు పదే పదే ఫోన్లు చేసిన ఓ తండ్రిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

Viral: తన కొడుకు హోం వర్క్ విషయమై స్కూల్‌కు పదే పదే ఫోన్లు.. తండ్రి అరెస్టు

ఇంటర్నెట్ డెస్క్: తన కుమారుడికి హోం వర్క్ ఎక్కువగా ఇస్తున్నారంటూ స్కూల్‌కు, పోలీసులకు పదే పదే ఫోన్లు చేసిన ఓ తండ్రిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral News) మారింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆడమ్ సైజ్‌మోర్ అనే వ్యక్తి ఒంటరిగానే తన కొడుకూ, కూతురి బాగోగులు చూసుకుంటున్నాడు. అతడి కుమారుడు ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్నాడు. అయితే, కుమారుడికి రోజూ బోలెడంత హోం వర్క్ ఇస్తున్నారని ఆరోపిస్తున్న అతడు ఇటీవల కాలంలో స్కూలు తరచూ ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదులతో విసిగిపోయిన స్కూలు యాజమాన్యం, చివరకు అతడి ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వడం మానేసింది.

Spit Stains: ఈ మహిళ కష్టం చూసాకైన జనాల్లో మార్పొస్తుందా? నెటిజన్లను కలచివేస్తున్న వీడియో!


దీంతో, మరింత రెచ్చిపోయిన ఆడమ్ ఈసారి ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. వారి నుంచీ ఆశించిన స్పందన కరువవడంతో ఓ సందర్భంలో గంటలో ఏకంగా 18 సార్లు పోలీసులకు ఫోన్ చేశాడు. అతడి తీరుతో విసిగిపోయిన వారు తాజగా అతడిని అరెస్టు చేశారు. ‘‘మా పనులను బాగా డిస్టర్బ్ చేశాడు. భరించలేకపోయాం’’ అని స్థానిక పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

అయితే, పోలీసులు, ఆరోపణల్లో అధికశాతం వాస్తవం కాదని ఆడమ్ చెప్పుకొచ్చాడు. తాను ఒంటరిగా పిల్లల్ని పెంచుతున్నానని, ఈ పరిస్థితుల్లో తాను చేయగలిగింది చేస్తున్నానని అతడు చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పులు చేయడం సాధారణమేనని అన్నాడు. కాగా, ఈ కేసులో ఆడమ్‌కు ఆరు నెలల జైలు, 1000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Juvenile Robbers: 11 ఏళ్ల వయసులోనే బ్యాంకు దోపిడీ.. సెలవుల్లో స్కూలు పిల్లల దారుణం! ఎలా చేశారంటే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 05:36 PM