‘చై’లో నాకు నచ్చేవి... | What I like about 'Chai'... ksv
Share News

‘చై’లో నాకు నచ్చేవి...

ABN , Publish Date - Dec 08 , 2024 | 07:16 AM

శోభిత ధూళిపాళ్ల... ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఎంచుకుంటూ... తనదైన ముద్ర వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి. ఈ ఏడాది ‘మంకీ మ్యాన్‌’తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత... నాగచైతన్యతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని విశేషాలివి...

‘చై’లో నాకు నచ్చేవి...

శోభిత ధూళిపాళ్ల... ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఎంచుకుంటూ... తనదైన ముద్ర వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి. ఈ ఏడాది ‘మంకీ మ్యాన్‌’తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత... నాగచైతన్యతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని విశేషాలివి...

అందంగా లేనన్నారు...

కెరీర్‌ తొలినాళ్లలో వాణిజ్య ప్రకటనల కోసం తరచూ ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. ఆకర్షణీయంగా లేనని ముఖం మీదే చెప్పేవారు. ఎక్కడికెళ్లినా ఇవే కామెంట్లు. ఓ ప్రముఖ కంపెనీ వాళ్లయితే బ్యాగ్రౌండ్‌ మోడల్‌గా కూడా పనికిరానని తిరస్కరించారు. చాలా బాధేసింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే... ఆత్మవిశ్వాసంతో ప్రయత్నాలు చేశా. కట్‌చేస్తే... కొన్నాళ్లకు అదే కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్ని అయ్యా.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

నచ్చితేనే ఓకే చేస్తా...

ఎప్పుడూ తెరపై కనిపించాలి, చేతినిండా పని ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతీ పాత్రనీ ఒప్పుకోను. నాకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే వచ్చిన అవకాశాల్లోంచి పాత్రలు ఎంచుకుంటా. విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాలని ఉంది. ముఖ్యంగా సవాళ్లతో కూడిన పాత్రలు చేయడమంటే ఇష్టం. యాక్షన్‌, పీరియాడిక్‌ సినిమాల్లో నటించి నా మార్క్‌ చూపించాలనుంది.

book1.jpg

వీర భక్తురాలిని...

నాకు భక్తి ఎక్కువ. వీలు కుదిరినప్పుడల్లా దేవాలయాలకు వెళ్తుంటా. అక్కడ కాసేపు గడిపితే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒత్తిడిగా అనిపించినా, మనసు బాగోకపోయినా వెంటనే చెల్లిని లేదా స్నేహితురాలిని వెంటబెట్టుకుని గుడికి వెళ్లిపోతుంటా. సమయం దొరికితే డ్యాన్స్‌ చేస్తుంటా. కూచిపూడి, భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది.


ఈగోలు పట్టించుకోను

నా భావాలు స్వతంత్రంగా ఉంటాయి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు కూడా అలాంటివే. ప్రతీ చిన్న విషయానికి చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీల్‌ అవుతా. అలాగే ఇతరుల ఈగోలను పట్టించుకోను. వాటి గురించి ఎప్పుడూ ఆలోచించను. ఏది మంచిదో, ఏది చెడ్డదో మన మనసుకు తెలుస్తుంది. కాబట్టి మనసు చెప్పిందే ఫాలో అవుతా. మనం నడుచుకునే తీరును బట్టే బంధాలు పటిష్టమవుతాయని నమ్ముతా.

book1.2.jpg

కవిత్వం రాస్తా...

వంట బాగా చేస్తా. నా వంటలను ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఆవకాయ, పులిహోర, ముద్దపప్పు, పచ్చిపులుసు నా ఫేవరెట్‌. ఎక్కడికెళ్లినా ఇంటి భోజనమే పట్టుకెళ్తా. కాస్త ఖాళీ సమయం దొరికితే వంటింట్లోకి దూరిపోతా. పుస్తకపఠనం చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువసేపు లైబ్రరీలోనే గడిపేదాన్ని. కవిత్వం కూడా రాస్తా. డైరీ రాయడమంటే ఇష్టం. రోజులో జరిగిన విషయాలను నోట్‌ చేసుకుంటా.


నా అదృష్టం

చై (నాగచైతన్య) సింప్లిసిటీ, మంచి మనసు, ఇతరుల పట్ల దయ... నన్ను మొదట ఆకట్టుకున్నాయి. చై చాలా మర్యాదస్తుడు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. అతనిలో నాకు బాగా నచ్చేవి అవే. చాలా కేరింగ్‌ పర్సన్‌ కూడా. నన్ను అమితంగా ప్రేమిస్తాడు. ఎలాంటి ప్రేమ కోసమైతే ఇంతకాలం ఎదురుచూశానో... అది నాకు చైతు నుంచి దక్కింది. అలాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టమనే చెప్పాలి.

city1.3.jpg


ఫటాఫట్‌

- ఫేవరెట్‌ హీరో: షారుక్‌ఖాన్‌

- ఇష్టమైన స్వీట్‌: జిలేబీ

- హ్యాండ్‌ బ్యాగ్‌లో ఎప్పుడూ ఉండేవి: ఇంటి తాళాలు, ఫోన్‌, ఇయర్‌ పాడ్స్‌, లిప్‌బామ్‌, పుస్తకం, పెన్సిల్‌, నోట్‌ప్యాడ్‌, చాక్లెట్స్‌

- పొద్దున్న లేవగానే చేసే మొదటిపని: మొక్కలకు నీళ్లు పోస్తా

- ఇష్టమైన దుస్తులు: చీర

- ఎవరికీ తెలియని విషయం: షూటింగ్‌ సమయంలో ఫోన్‌ అస్సలు చూడను

- ఫేవరెట్‌ వర్కవుట్స్‌: జాడు, పోచా

Updated Date - Dec 08 , 2024 | 10:11 AM