Share News

Viral Video: గొడుగులు అద్దెకిచ్చే కంపెనీ ఉందని మీకు తెలుసా.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 20 , 2024 | 06:14 PM

పని మీద బయటికి వెళ్లిన సమయంలో ఉన్నట్టుండి వర్షం మొదలైతే.. పరుగుపరుగు ఏ బస్టాప్‌ వద్దకో, దుకాణాల వద్దకే వెళ్లి తడవకుండా జాగ్రత్త పడతాం. అలాగే ఎండాకాలంలోనూ ఎండ వేడికి ఇబ్బంది పడుతుంటాం. అలాంటి సమయాల్లో గొడుగు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ...

Viral Video:  గొడుగులు అద్దెకిచ్చే కంపెనీ ఉందని మీకు తెలుసా.. వీడియో వైరల్..

పని మీద బయటికి వెళ్లిన సమయంలో ఉన్నట్టుండి వర్షం మొదలైతే.. పరుగుపరుగు ఏ బస్టాప్‌ వద్దకో, దుకాణాల వద్దకే వెళ్లి తడవకుండా జాగ్రత్త పడతాం. అలాగే ఎండాకాలంలోనూ ఎండ వేడికి ఇబ్బంది పడుతుంటాం. అలాంటి సమయాల్లో గొడుగు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ దాన్ని తీసుకెళ్లడం, మళ్లీ తీసుకురావడం చాలా మంది పెద్ద కష్టంగా ఫీల్ అవుతుంటారు. అయితే ఇలాంటి కష్టం ఏదీ లేకుండా గొడుగు అద్దెకు దొరికితే ఎంత బాగుంటుందీ.. ఇదే ఆలోచన ఆ యుకువలకూ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగారు. గొడుగులు ఇద్దెకిచ్చే కంపెనీనే స్టార్ట్ చేశారు. ఇంతకీ ఆ కంపెనీ ఏంటీ, ఏ ప్రాంతంలో అద్దెకు ఇస్తున్నారు.. తదితర వివరాల్లోకి వెళితే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సోహన్‌ ఎం రాయ్‌, మెల్రాయ్ సల్దాన్హా అనే ఇద్దరు యువకులు.. కర్నాటకలోని మంగళూరులో గొడుగులు అద్దెకు ఇచ్చే (Umbrellas for rent) వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. వర్షాకాలంలో నగరంలోకి వచ్చే వారు ఇబ్బందులు పడకుండా ఏదైనా చేయాలని అనుకున్నారు.

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఈ క్రమంలోనే వారికి గొడుగులను షేర్ చేసుకునే ఐడియా వచ్చింది. వెంటనే డ్రిజిల్ (Drizzle) పేరుతో ఓ కంపెనీ స్టార్ట్ చేశారు. ఇదే పేరుతో యాప్‌ను కూడా రూపొందించారు. బస్టాప్‌లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో తమ కంపెనీ పేరుతో కొన్ని గొడుగులను స్టాండ్‌లో ప్రదర్శనగా ఉంచుతారు. అవసరం ఉన్న వారు గొడుగులను తీసుకుని, తమ అవసరం తీరిపోగానే మళ్లీ అక్కడే పెట్టి వెళ్లవచ్చు. వర్షం వచ్చే సమయంలో ఈ యాప్‌ ద్వారా గొడుగును ఆర్డర్ చేసుకోవచ్చు. రాయ్‌కి ఈ ఆలోచన 12వ తరగతి చదువుతున్నప్పుడే వచ్చిందట. అయితే ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్‌ చదువుతుండగా తన కలను సాకారం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.

Viral Video: విద్యార్థులు క్లాస్‌ రూమ్‌లో ఉండగా ఊహించని ఘటన.. గోడ పైకి చూడగా షాకింగ్ సీన్.. చివరకు..


ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత ఇంజినీరింగ్ వదిలేసి, తన సహచరుడు మెల్రాయ్‌తో కలిసి ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ వెసులుబాటను మంగళూరు అంతటా విస్తరించేందుకు ఈ యువకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 24 గంటల వరకూ ఫ్రీగా వాడుకోవచ్చని. తర్వాత నిబంధనల మేరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.400లు చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గొడుగు పాడు చేస్తే డిపాజిట్ మొత్తం తిరిగి చెల్లించడబడదని నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: కట్టేసి ఉన్న దూడ దగ్గరికి కోబ్రా ఎంట్రీ.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే.. షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2024 | 06:14 PM