Share News

Emerging Asia Cup: అభిషేక్‌ శర్మ దూకుడుతో భారత్-ఏ సునాయాస విజయం

ABN , Publish Date - Oct 21 , 2024 | 10:05 PM

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ 2024లో భారత్-ఏ జట్టు మరో సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒమన్‌లోని అల్ అమ్రాట్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Emerging Asia Cup: అభిషేక్‌ శర్మ దూకుడుతో భారత్-ఏ సునాయాస విజయం
Abhishek Sharma

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ 2024లో భారత్-ఏ జట్టు మరో సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒమన్‌లోని అల్ అమ్రాట్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి యూఏఈ నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 24 బంతులు ఎదుర్కొని 58 పరుగులు బాదాడు. ఇందులో 4 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఔట్ అయినప్పటికీ మిగతా బ్యాటర్లు లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో 10.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్-ఏ జట్టు లక్ష్యాన్ని చేరుకుంది.


అంతకుముందు బౌలింగ్‌లో కూడా యువ క్రికెటర్లు అద్భుతంగా రాణించారు. ఆటను త్వరగా ముగించాలని చూస్తున్నప్పుడు, అభిషేక్ లాంగ్-ఆన్‌కి క్యాచ్ ఇచ్చి భారత్ విజయానికి చాలా దూరంలో పడ్డాడు. ఓపెనర్ అభిషేక్‌-కెప్టెన్ తిలక్ శర్మ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ కలిసి రెండవ వికెట్‌కు 72 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔట్ అయినప్పటికీ యువ క్రికెటర్లు నేహాల్ వధేరా, ఆయుష్ బదోని లక్ష్యాన్ని పూర్తి చేశారు. చివరిలో బదోని ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. ఈ విజయంతో భారత జట్టు 2 గెలుపులతో గ్రూప్‌-బీలో అగ్రస్థానానికి చేరుకుంది.

Updated Date - Oct 21 , 2024 | 10:05 PM