Share News

స్నేహిత్‌కు కాంస్యం

ABN , Publish Date - Nov 23 , 2024 | 02:39 AM

తెలుగు ఆటగాడు స్నేహిత్‌ జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పతకంతో మెరిశాడు. హరియాణాలోని పంచకులలో...

స్నేహిత్‌కు కాంస్యం

హైదరాబాద్‌: తెలుగు ఆటగాడు స్నేహిత్‌ జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పతకంతో మెరిశాడు. హరియాణాలోని పంచకులలో శుక్రవారం జరిగిన సింగిల్స్‌ సెమీఫైనల్లో స్నేహిత్‌ 2-4తో ఢిల్లీకి చెందిన పయాస్‌ జైన్‌ చేతిలో ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. కాగా సాథియాన్‌ విజేతగా నిలిచాడు.

Updated Date - Nov 23 , 2024 | 02:47 AM