Share News

వామప్‌ మ్యాచ్‌ రద్దు సరికాదు

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:08 AM

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ ‘ఎ’తో ఆడాల్సిన టీమిండియా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను రద్దు చేయడాన్ని మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ తప్పుపట్టాడు. ‘వామప్‌ మ్యాచ్‌ ద్వారా జైస్వాల్‌, సర్ఫరాజ్‌లాంటి యువ ఆటగాళ్లకు...

వామప్‌ మ్యాచ్‌ రద్దు సరికాదు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ ‘ఎ’తో ఆడాల్సిన టీమిండియా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను రద్దు చేయడాన్ని మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ తప్పుపట్టాడు. ‘వామప్‌ మ్యాచ్‌ ద్వారా జైస్వాల్‌, సర్ఫరాజ్‌లాంటి యువ ఆటగాళ్లకు అక్కడి పిచ్‌లపై అవగాహన వచ్చేది. ఒకవేళ వారు త్వరగా అవుటైనా నెట్స్‌లో త్రోడౌన్‌ స్పెషలిస్టుల ద్వారా ప్రాక్టీస్‌ సాగించేవారు. అలాగే పేసర్లు ఆకాశ్‌, హర్షిత్‌లకు సైతం వికెట్‌పై ఏ లెంగ్త్‌లో బౌలింగ్‌ వేయాలో తెలిసొచ్చేది’ అని గవాస్కర్‌ సూచించాడు. ప్రస్తుత జట్టులో 8 మంది ఆటగాళ్లకు ఆసీస్‌ గడ్డపై భారత్‌ తరఫున ఆడిన అనుభవం లేకపోవడం గమనార్హం.

Updated Date - Nov 06 , 2024 | 01:08 AM