Share News

Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ, రోహిత్‌లకూ సాధ్యం కాలేదు

ABN , Publish Date - Jul 14 , 2024 | 02:49 PM

టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని ఓ రిమార్కబుల్ ఫీట్‌ని..

Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ, రోహిత్‌లకూ సాధ్యం కాలేదు
Abhishek Sharma

టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఓ అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) వంటి స్టార్ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని ఓ రిమార్కబుల్ ఫీట్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో భాగంగా.. అతను ఓ సెంచరీ నమోదు చేయడంతో పాటు ఒక వికెట్ పడగొట్టాడు. ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయుడి అతడే!


తొలుత జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసకర సెంచరీ చేశాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే బౌండరీల మోత మోగించేసిన అతను.. కేవలం 47 బంతుల్లోనే శతకం (100) బాదేశాడు. అనంతరం.. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో అతను ఒక వికెట్ పడగొట్టాడు. తొమ్మిదో ఓవర్‌లోని నాలుగో బంతికి తాడివనాశే మారుమణి (32) భారీ షాట్ కొట్టడానికి ట్రై చేయగా.. అది నేరుగా రింకూ సింగ్ చేతుల్లోనే వెళ్లింది. దీంతో.. అతడు పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఇలా ఓ టీ20I సిరీస్‌లో శతకం చేయడంతో పాటు ఓ వికెట్ పడగొట్టడంతో.. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయుడిగా అభిషేక్ చరిత్రపుటలకెక్కాడు.


భారత్ తరఫున ఇప్పటివరకు మొత్తం 10 మంది ఆటగాళ్లు టీ20I లో సెంచరీలు సాధించారు. కానీ.. అభిషేక్ మినహా ఏ ఒక్కరూ ఓ సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్‌ని తీయలేకపోయారు. ఇకపోతే.. జింబాబ్వేతో జరిగిన టీ20I సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసినా.. ఆ తర్వాత వరుసగా విజయాలు నమోదు చేస్తూ, సిరీస్ సాధించింది. ఇందులో యువ ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించారు. బ్యాటర్లు, బౌలర్లందరూ.. ఈ సిరీస్‌లో తమ సత్తా చాటారు.

Read latest Sports News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 02:49 PM