Irfan Pathan: మొదటిసారి భార్య ముఖాన్ని బయటపెట్టిన టీమిండియా మాజీ క్రికెటర్
ABN , Publish Date - Feb 04 , 2024 | 02:03 PM
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారి తన భార్య సఫా బేగ్ ముఖాన్ని బయటపెట్టాడు. తమ 8వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసి ఉన్న ఫోటోను ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారి తన భార్య సఫా బేగ్ ముఖాన్ని బయటపెట్టాడు. తమ 8వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసి ఉన్న ఫోటోను ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ తనపై ప్రశంసలు కురిపించాడు. ఇర్ఫాన్ పఠాన్‌కు సఫా బేగ్‌తో వివాహం జరిగి 8 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎప్పుడూ కూడా ఆమెను అభిమానులకు పరిచయం చేయలేదు. గతంలో సోషల్ మీడియాలో తన భార్యతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసినప్పటికీ ఆమె ముఖం కనిపించకుండా కవర్ చేశాడు. దీంతో అప్పట్లో ఇర్ఫాన్ పఠాన్‌పై విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన అందమైన భార్యతో ఉన్న ఫోటోను ఇర్ఫాన్ పఠాన్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన భార్యపై ఇర్ఫాన్ ప్రశంసలు కురిపించాడు.
‘‘నా మానసిక స్థితిని బలంగా ఉంచుతూ నన్ను సంతోషంగా ఉంచే వ్యక్తి. నా ప్రాణమైన నువ్వు అనేక బాధ్యతలు చేపడుతున్నావు. నన్ను నిరంతరం ఆనందంగా ఉంచే భార్యగానే కాకుండా పిల్లల అలనా పాలన చూసుకునే తల్లిగా, మంచి స్నేహితురాలిగా వ్యవహరిస్తున్నావు. ఈ అందమైన ప్రయాణంలో నేను నిన్ను నా భార్యగా ప్రేమిస్తున్నాను. నా లవ్(భార్య)కు 8వ వార్షికోత్సవం శుభాకాంక్షలు’’ అని పఠాన్ ట్వీట్ చేశాడు. కాగా ప్రముఖ వ్యాపారవేత్త మీర్జా ఫరూఖ్ బేగ్ కుమార్తెనే ఇర్ఫాన్ పఠాన్ భార్య సఫా బేగ్. భారతదేశానికి చెందిన మీర్జా ఫరూఖ్ బేగ్ సౌదీ అరేభియాలో స్థిరపడ్డారు. అక్కడే తన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. పఠాన్‌తో వివాహానికి ముందు సఫా బేగ్ మోడల్‌గా పనిచేసేది. ఇర్ఫాన్ పఠాన్-సఫా బేగ్‌ల పరిచయం 2014లో జరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2016లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.