IND vs SA: రెండో టెస్టులో విజయం మనదే.. ఆ సత్తా ఉన్న బ్యాటర్లు సౌతాఫ్రికాకు లేరు: గవాస్కర్
ABN , Publish Date - Jan 04 , 2024 | 11:54 AM
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఉన్న అతిథ్య జట్టు బ్యాటింగ్ లైనప్ రోహిత్ సేనను పెదగా ఇబ్బంది పెట్టకపోవచ్చని అన్నాడు.
కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఉన్న అతిథ్య జట్టు బ్యాటింగ్ లైనప్ రోహిత్ సేనను పెదగా ఇబ్బంది పెట్టకపోవచ్చని అన్నాడు. ప్రస్తుతం వారి దగ్గర 150 నుంచి 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగల బ్యాటర్లు లేరని అభిప్రాయపడ్డాడు. పైగా రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయిందని అన్నాడు. దీంతో మ్యాచ్ ప్రస్తుతం భారత్ చేతుల్లోనే ఉందని చెప్పుకొచ్చాడు. ‘‘సౌతాఫ్రికా ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ అధిక్యంలో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ టీమిండియా చేతుల్లో నుంచి జారిపోతుందని నేను అనుకోవడం లేదు. కానీ అది ఇన్నింగ్స్ విజయం కాకపోవచ్చు. అయితే వారు (టీమిండియా) కొంచెం బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 150 నుంచి 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేరించి భారత్‌ను ఇబ్బంది పెట్టగల బ్యాటర్లు సౌతాఫ్రికాకు ఉన్నారని నేను అనుకోవడం లేదు.’’ అని గవాస్కర్ చెప్పాడు.
కాగా భారత్, సౌతాఫ్రికా మధ్య మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఏకంగా 23 వికెట్లు వికెట్లు నేలకూలాయి. పిచ్‌పై బౌన్స్ లభించడంతో పండుగ చేసుకున్న రెండు జట్ల పేసర్లు బఠాణీలు తిన్నంత సులువుగా వికెట్లు పడగొట్టారు. ఒకానొక దశలో పరుగుల కంటే ఎక్కువగా వికెట్లే వచ్చాయి. రెండు జట్లు తమ మొదటి ఇన్నింగ్స్‌లో తొలి రోజే ఆలౌట్ అయ్యాయి. అంతేకాకుండా తొలి రోజు ఆటలోనే రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభమైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అతిథ్య జట్టు సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆ జట్టు భారత్ కన్నా ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులు మాత్రమే చేయగా.. భారత జట్టు 153 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 98 పరుగుల అధిక్యం లభించింది. తొలి రోజే సంచలనాల మీద సంచలనాలు నమోదుకావడంతో ఈ టెస్టు మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది. పిచ్ రెండో రోజు కూడా ఇదే విధంగా ఉంటే టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం ఖాయం.