Share News

IND vs AUS: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. రెండో టెస్ట్‌కు ముందు వదలని కష్టాలు

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:23 PM

ప్రతి దానికి ఓవరాక్షన్ చేసే ఆస్ట్రేలియా జట్టుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అసలే తొలి టెస్టులో ఓడి భారత్ అంటే భయపడుతున్న ఆ జట్టుకు రెండో టెస్ట్‌కు ముందు గట్టి షాక్ తగిలింది.

IND vs AUS: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. రెండో టెస్ట్‌కు ముందు వదలని కష్టాలు

IND vs AUS: ప్రతి దానికి ఓవరాక్షన్ చేయడం ఆస్ట్రేలియాకు అలవాటు. తామే వరల్డ్ ఛాంపియన్స్ అంటూ బీరాలకు పోవడం కంగారూలకు ఆనవాయితీగా మారింది. ఓడినా తమదే పైచేయి అని బిల్డప్ ఇవ్వడం వారికే చెల్లింది. అయితే ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి బాగోలేదు. ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అసలే పెర్త్ టెస్టులో ఓడి టీమిండియా అంటే భయపడుతున్న ఆ జట్టుకు రెండో టెస్ట్‌కు ముందు గట్టి షాక్ తగిలింది. టీమ్ నుంచి కీలక ప్లేయర్ బయటకు వెళ్లిపోయాడు. దీంతో అడిలైడ్‌ ఫైట్‌కు ముందే కమిన్స్ సేన డిఫెన్స్‌లో పడిపోయింది. మరి.. ఆసీస్‌కు దూరమైన ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు చూద్దాం..


సిసలైనోడు దూరం

ఆస్ట్రేలియా స్టార్ సీమర్ జోష్ హేజల్‌వుడ్ సెకండ్ టెస్ట్‌కు దూరమయ్యాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్ నుంచి అతడు తప్పుకున్నాడు. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6వ తేదీ నుంచి పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం కానుంది. నడుం కింది భాగంలో నొప్పి రావడంతో ఆసీస్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు హేజల్‌వుడ్. అతడ్ని పరీక్షించిన మెడికల్ టీమ్ రెస్ట్ అవసరమని సూచించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. సిచ్యువేషన్ మెరుగవకపోతే సిరీస్ మొత్తానికీ అతడు దూరమయ్యే ప్రమాదం ఉందని సమాచారం.


బరిలోకి బోలాండ్!

హేజల్‌వుడ్ స్థానంలో యంగ్ పేసర్ స్కాట్ బోలాండ్‌ను సెలెక్ట్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. అతడితో పాటు సీన్ అబాట్, డొగ్గెట్‌ను కూడా ఎంపిక చేసింది. అయితే ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌ టీమ్‌లో ఉన్న బోలాండ్ వార్మప్ మ్యాచ్‌లో నిరూపించుకుంటే పింక్ టెస్ట్ తుదిజట్టులో స్థానం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా, పెర్త్ టెస్ట్‌లో ఆసీస్ అన్ని విభాగాల్లో ఫెయిలైంది. ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన హేజల్‌వుడ్ మిగతా బౌలర్ల కంటే బాగా పెర్ఫార్మ్ చేశాడు. అలాంటోడు దూరమవడం ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అతడి సీమ్, బౌన్స్‌కు విరాట్ కోహ్లీతో పాటు ఇతర బ్యాటర్లు కూడా ఇబ్బంది పడటం గతంలో చూశాం. అలాంటోడు లేకపోవడం టీమిండియాకు కలిసొస్తుందని చెప్పొచ్చు.


Also Read:

విరాట్‌ను దాటేశాడు

అదరగొట్టిన రోహిత్‌, తిలక్‌

ఓటమి దిశగా శ్రీలంక

For More Sports And Telugu News

Updated Date - Dec 01 , 2024 | 09:08 AM