Share News

Urvil Patel: 28 బంతుల్లోనే సెంచరీ.. అన్‌సోల్డ్ ప్లేయర్ ఆల్‌టైమ్ రికార్డ్

ABN , Publish Date - Nov 27 , 2024 | 03:23 PM

Urvil Patel: ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన ఓ ప్లేయర్ ఏకంగా రిషబ్ పంత్ రికార్డును బద్దలుకొట్టాడు. 28 బంతుల్లోనే సెంచరీ బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Urvil Patel: 28 బంతుల్లోనే సెంచరీ.. అన్‌సోల్డ్ ప్లేయర్ ఆల్‌టైమ్ రికార్డ్

SMAT 2024: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా వేలం చాలా ఆసక్తికరంగా సాగింది. పలువురు టాప్ ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది. కొందరు స్టార్లు తక్కువ ధరకు అమ్ముడుబోయారు. మంచి ధర పలుకుతారని అనుకున్న పలువురు సీనియర్ క్రికెటర్లు అన్‌సోల్డ్‌గా మిగిలారు. ఇలా అమ్ముడుపోని క్యాటగిరీలో ఓ చిచ్చరపిడుగు కూడా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతున్న అతడ్ని ఏదో ఒక ఫ్రాంచైజీ తప్పనిసరిగా తీసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్. ఎవరూ అతడ్ని విక్రయించలేదు. దీంతో కసిగా ఆడి ఆల్‌టైమ్ రికార్డు కొట్టాడు. ఏకంగా 28 బంతుల్లోనే శతకం బాదేశాడు. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..


మొదట్నుంచి అదే దూకుడు

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంచలనం నమోదైంది. గుజరాత్ వికెట్ కీపర్, బ్యాటర్ ఉర్విల్ పటేల్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మధ్యప్రదేశ్ వేదికగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఈ 26 ఏళ్ల చిచ్చరపిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. గతంలో పంత్ 32 బంతుల్లో మూడంకెల మార్క్‌ను చేరుకోగా.. ఇప్పుడా రికార్డును ఉర్విల్ పటేల్ బ్రేక్ చేశాడు. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతడు ఒకే రీతిన ఆడాడు. బాదుడే మంత్రంగా వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీకి తరలించాడు.


కనికరం లేకుండా బాదేశాడు

ఉర్విల్ ఏ బౌలర్‌ను కూడా వదల్లేదు. అందర్నీ చీల్చిచెండాడాడు. కనికరం లేకుండా భారీ షాట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న ఈ గుజరాత్ బ్యాటర్.. 7 బౌండరీలు, 12 సిక్సుల సాయంతో 113 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి స్ట్రైక్ రేట్ 322గా ఉంది. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ విధ్వంసం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కాగా, రీసెంట్‌గా జరిగిన ఐపీఎల్ ఆక్షన్‌లో ఉర్విన్ అన్‌సోల్డ్ వికెట్ కీపర్‌గా నిలిచాడు. అతడి తాజా ఇన్నింగ్స్ చూసిన నెటిజన్స్.. ఇంత భారీ హిట్టర్‌ను ఫ్రాంచైజీలు, ఫ్యాన్స్ మిస్ అయ్యారని అంటున్నారు. అతడు లీగ్‌లో ఆడి ఉంటే అదిరిపోయేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, దేశవాళీ క్రికెట్‌లో 44 మ్యాచులు ఆడిన ఉర్విల్.. 988 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 14 మ్యాచుల్లో 415 పరుగులు చేశాడు. మంచి స్ట్రోక్ ప్లే, భారీ షాట్లు ఆడగల సామర్థ్యం, వికెట్ కీపింగ్ ఎబిలిటీస్ ఉన్న ఉర్విల్.. క్రీజులో నిలదొక్కుకుంటే మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేస్తాడు.


Also Read:

పంత్‌తో ప్యాచప్.. ఊర్వశి ప్రయత్నాలు ఫలించేనా..

ఆ మీమ్స్ చూసి బాధపడ్డా.. పృథ్వీ షా వీడియో వైరల్

బజ్‌రంగ్‌పై నాలుగేళ్ల నిషేధం

For More Sports And Telugu News

Updated Date - Nov 27 , 2024 | 03:26 PM