Share News

Azam Khan: అందరికీ 10.. ఆజం ఖాన్‌కి మాత్రం 20

ABN , Publish Date - Jun 15 , 2024 | 09:21 AM

టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ వికెట్-కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరచడంతో.. అతనిపై తారాస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా.. అతని ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌తో..

Azam Khan: అందరికీ 10.. ఆజం ఖాన్‌కి మాత్రం 20
Mohammad Hafeez Sensational Comments On Azam Khan

టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) పాకిస్తాన్ వికెట్-కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ (Azam Khan) అత్యంత పేలవ ప్రదర్శన కనబరచడంతో.. అతనిపై తారాస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా.. అతని ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌తో పాటు మాజీలు సైతం పెదవి విరుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ (Mohammed Hafeez) చేరిపోయాడు. అతనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆజంకి ఫిట్‌నెస్‌పై ఏమాత్రం ఆసక్తి లేదని, అతనిని మార్చాలని తాము చేసిన ప్రయత్నం విఫలం అయ్యిందని కుండబద్దలు కొట్టాడు. పీటీవీ స్పోర్ట్స్‌లో ఇంటరాక్షన్‌లో భాగంగా.. హఫీజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.


Read Also: తక్షణమే యుద్ధం ఆపేందుకు సిద్ధమేనన్న పుతిన్.. కానీ!

‘‘పాకిస్తాన్ జట్టులోని ఆటగాళ్లందరూ పది నిమిషాల్లో రెండు కిలోమీటర్లు చుట్టి వస్తే.. ఆజం ఖాన్‌కి మాత్రం 20 నిమిషాల సమయం పడుతుంది. సన్నగానో, లావుగానో ఉండటం సమస్య కాదు. ఆటకు తగినట్లు శరీరాన్ని మలచుకోవడం ఎంతో ముఖ్యం. నిర్దేశిత ఫిట్‌నెస్ లెవెల్స్‌ని సాధించాల్సి ఉంటుంది. గతంలో ఆజంకి మేము ఓ ఫిట్‌నెస్ ప్లాన్ ఇచ్చాం. కానీ.. అతను ఏమాత్రం మెరుగుపడలేదు. ఆరు వారాల శిక్షణ తర్వాత అతనిలో ఏమాత్రం కనిపించలేదు. అంతే లావుగా ఉన్నాడు. అతని స్టామినా కూడా తగ్గింది. జట్టులో ఆజం తప్ప ఫిట్‌నెస్ విషయంలో ఎవరూ కాంప్రమైజ్ అవ్వరు. అఫ్‌కోర్స్.. టాలెంట్ ఉంటేనే జట్టులో అవకాశం వస్తుంది. అలాంటప్పుడు.. ఫిట్‌నెస్ కాపాడుకుంటే మరింత మంచిది కదా’’ అని మహ్మద్ హఫీజ్ చెప్పుకొచ్చాడు.


Read Also: బస్సుపై ఉగ్రదాడి.. అందరినీ చంపేయాలన్న కసి వారిలో..

కాగా.. అంతర్జాతీయ టీ20లో పాకిస్తాన్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన ఆజం ఖాన్ 8.80 సగటు, 133.33 స్ట్రైక్-రేట్‌తో స్ట్రైక్‌రేట్‌తో కేవలం 88 పరుగులే చేశాడు. అందులో అతని హయ్యస్ట్ స్కోరు 30. మరోవైపు.. ఈ టీ20 టోర్నీ నుంచి పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. యూఎస్ఏ రెండు విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో తన ఖాతాలో 5 పాయింట్లు వేసుకోవడంతో.. ఆ జట్టు సూపర్-8కు అర్హత సాధించింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 09:21 AM