PCB vs BCCI: దిగొచ్చిన పాకిస్థాన్.. బీసీసీఐ దగ్గర తోకజాడిస్తే ఇలాగే ఉంటుంది
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:29 PM
భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు తెలిసొచ్చింది. మన క్రికెట్ బోర్డు దగ్గర తోకజాడిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో వారికి బాగా అర్థమైంది. అందుకే పాక్ దిగొచ్చింది.
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్న, శక్తిమంతమైన బోర్డుగా బీసీసీఐ డామినేషన్ నడిపిస్తోంది. ఆసియా క్రికెట్ దగ్గర నుంచి ఐసీసీ వరకు అంతా భారత బోర్డుదే ఆధిపత్యం. అందుకే మన బోర్డుతో పెట్టుకోవాలంటే టాప్ టీమ్స్ కూడా భయపడతాయి. కానీ దాయాది పాకిస్థాన్ మాత్రం గత కొన్నాళ్లుగా మనకు మోకాలు అడ్డు పెడుతూ వస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఓవరాక్షన్ చేస్తూ ఇబ్బంది పెడుతోంది. అయితే బీసీసీఐతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్ బోర్డుకు తెలిసొచ్చింది. మన బోర్డు దగ్గర తోక జాడిస్తే ఇక అంతే సంగతులు అని క్లారిటీ రావడంతో పీసీబీ ఎట్టకేలకు దిగొచ్చింది.
హైబ్రిడ్ మోడల్‌కు ఓకే.. కానీ?
ఐసీసీ దెబ్బకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చిందని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోవడం లేదా టోర్నీ నిర్వహణ నుంచి తప్పుకోవడం.. ఏదో ఒకటి 24 గంటల్లోపు తేల్చాలని ఐసీసీ ఇచ్చిన అల్టిమేటంతో పీసీబీ దిగొచ్చిందని తెలుస్తోంది. ఎట్టకేలకు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఐసీసీ ప్రతిపాదనకు ఒప్పుకున్నా పీసీబీ కొన్ని షరతులు విధించిందని సమాచారం.
షరతులివే..
ఐసీసీకి పీసీబీ మూడు కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. భారత జట్టు గ్రూప్ స్టేజ్, సెమీఫైనల్స్, ఫైనల్స్ (ఒకవేళ క్వాలిఫై అయితే) ఆడే మ్యాచుల్ని దుబాయ్‌లోనే నిర్వహించడం అందులో మొదటిది. టీమిండియా గనుక గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తే.. అప్పుడు సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్ మ్యాచుల్ని లాహోర్‌లోనే నిర్వహించేందుకు పాకిస్థాన్‌కు పర్మిషన్ ఇవ్వాలనేది రెండో డిమాండ్. ఫ్యూచర్‌లో టీమిండియా నిర్వహించే ఐసీసీ ఈవెంట్స్ ఆడేందుకు పాకిస్థాన్ అక్కడికి వెళ్లకుండా తటస్థ వేదికల మీద మ్యాచులు నిర్వహించేందుకు ఒప్పుకోవడం అనేది మూడో షరతు అని సమాచారం.
Also Read:
ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ
విరాట్‌ను దాటేశాడు
అదరగొట్టిన రోహిత్, తిలక్
For More Sports And Telugu News