Share News

MS Dhoni: ధోనీతో కాంట్రవర్సీ.. తొలిసారి స్పందించిన సంజీవ్ గొయెంకా..

ABN , Publish Date - Dec 12 , 2024 | 05:17 PM

ధోనీతో ఉన్న కాంట్రవర్సీపై ఎల్‌ఎస్‌జీ జట్టు ఓనర్ సంజీవ్ గొయెంకా స్పందించాడు. ఈ సందర్భంగా ఈ మిస్టర్ కూల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీతో తనకున్న అనుబంధం, కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించాల్సి రావడం వంటి విషయాలపై గొయెంకా మాట్లాడాడు.

MS Dhoni: ధోనీతో కాంట్రవర్సీ.. తొలిసారి స్పందించిన సంజీవ్ గొయెంకా..
MS Dhoni

ముంబై: 2016లో లాస్ట్ నుంచి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్న రైజింగ్ పూణె జెయింట్స్ జట్టు.. ఆ తర్వాత ఊహించని నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్ గా ఉన్న ధోనీని ఆ పదవి నుంచి తొలగించింది. రెండు సీజన్లలో ఐపీఎల్ లో పాల్గొన్న జట్లలో పూణె జట్టు కూడా ఒకటి. గుజరాత్ లయన్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్తాన్ రాయల్స్ జట్లను వరుసగా 2016, 2017లో నిషేధించారు. ఆ తర్వాత తనను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ధోనీ ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనలేదని గొయెంకా అన్నాడు. తామిద్దరి మధ్య ఇప్పటికీ ఎంతో మంచి రిలేషన్ ఉందని తెలిపాడు. కెప్టెన్సీ విషయంలోనూ ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు కూడా రాలేవన్నారు.


అతడే రోజు నన్ను ఒక్క మాట కూడా అనలేదు.. అనడు కూడా. మా ఇద్దరికీ వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ మేమిద్దరం అంతే అనుబంధంతో మెలుగుతున్నామనేది ముఖ్యమైన విషయం. 43 ఏళ్ల ధోనీని ఇటీవల సీఎస్ కే 4 కోట్లకు అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ లో ధోనీకి ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశాలున్నాయి. గొయెంకా మాట్లాడుతూ.. ఇప్పటికీ ధోనీ కొత్తగా తనను తాను మలుచుకుంటాడని అన్నాడు. ధోనీ లాంటి లీడర్ ను నేనెప్పుడూ చూడలేదు. అతడి ఆలోచనా విధానం.. ఈ వయసులోనూ ఎప్పుడూ ఆటలో కొత్తదనం ప్రదర్శించడం అతడికి మాత్రమే సొంతం. పతిరానాను ఆ స్థానానికి చేర్చింది ధోనీనే. ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకోవాలో అతడికి బాగా తెలుసు అని గొయెంకా అన్నాడు.


నేనెప్పుడు ధోనీని కలిసినా అతడి నుంచి ఎంతో నేర్చుకుంటాను. లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్ సందర్భంగా ఓ సంఘటన ఇప్పటికీ మర్చిపోలేను. ధోనీ మా ఇంటికొచ్చిన ప్రతిసారి నా పదకొండేళ్ల మనవడు అతడి బుర్ర తినేవాడు. వాడికీ క్రికెట్ అంటే ఎంతో పిచ్చి. అతడికి క్రికెట్ ఎలా ఆడాలో ధోనీ నేర్పిస్తూ ఉండేవాడు. ఇక చాలు అతడిని విసిగించొద్దు అని నేను నా మనవడిని వారించేవాడిని కానీ.. ధోనీ నన్ను ఆపేవాడు. నేను అతడితో మాట్లాడటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను ఆపకండి అనేవాడు. అంత చిన్నవాడితోనూ గంటలకొద్దీ క్రికెట్ గురించి మాట్లాడుతుంటే నాకెంతో ముచ్చటేసేది. లక్నో పై ధోనీ ఎప్పుడు పోటీకి దిగినా ధోనీని సపోర్ట్ చేసేందుకు అక్కడి స్టేడియం మొత్తం పసుపు రంగు చొక్కాలు ధరించి వచ్చేవారు అని అతడికున్న ఫాన్ ఫాలోయింగ్ ను గొయెంకా గుర్తుచేసుకున్నాడు.

Team India: బ్రిస్బేన్‌‌కు పాకిన ‘కప్ నమ్దే’ స్లోగన్.. వణికిపోతున్న ఫ్యాన్స్


Updated Date - Dec 12 , 2024 | 05:37 PM