Share News

ఫేవరెట్‌ గుకేష్‌

ABN , Publish Date - Nov 24 , 2024 | 01:18 AM

చెస్‌ ప్రపంచంలో రసవత్తర పోటీకి రంగం సిద్ధమైంది. విశ్వవిజేతను తేల్చే సమరంలో భారత చిచ్చరపిడుగు, 18 ఏళ్ల గుకేష్‌, చైనాకు చెందిన 32 ఏళ్ల డింగ్‌ లిరెన్‌ను ఢీకొననున్నాడు...

ఫేవరెట్‌ గుకేష్‌

లిరెన్‌తో పోరు

రేపటి నుంచే వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప

సింగపూర్‌: చెస్‌ ప్రపంచంలో రసవత్తర పోటీకి రంగం సిద్ధమైంది. విశ్వవిజేతను తేల్చే సమరంలో భారత చిచ్చరపిడుగు, 18 ఏళ్ల గుకేష్‌, చైనాకు చెందిన 32 ఏళ్ల డింగ్‌ లిరెన్‌ను ఢీకొననున్నాడు. ఈ 14రౌండ్ల క్లాసికల్‌ గేమ్‌ల ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ సోమవారం మొదలవనుంది. తొలుత 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడికి ప్రపంచ కిరీటం దక్కుతుంది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 21 కోట్లు. ఫలితం టైబ్రేక్‌కు వెళ్తే విజేతకు రూ.10.97 కోట్లు, రన్నరప్‌కు రూ. 10.13 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. 138 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఇద్దరు ఆసియా ఆటగాళ్లు తలపడుతుండడం ఇదే తొలిసారి. గుకేష్‌ను టోర్నీ ఫేవరెట్‌ అన్నది చెస్‌ పండితుల అంచనా. నిరుడు ప్రపంచ టైటిల్‌ గెలిచాక లిరెన్‌ ఫామ్‌ దిగజారింది.


దాంతో వరల్డ్‌ ర్యాంకుల్లో అతను 23వ స్థానానికి పడిపోయాడు. మరోవైపు గుకేష్‌ ఐదో ర్యాంక్‌కు ఎగబాకడం విశేషం. అంతేకాదు.. గుకేష్‌ క్యాండిడేట్స్‌ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారానే లిరెన్‌తో ప్రపంచ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు.

Updated Date - Nov 24 , 2024 | 01:18 AM