ఒలింపిక్స్‌లో ఆడకుండా అడ్డుకుంటున్నాడు..
ABN , Publish Date - Apr 13 , 2024 | 02:15 AM
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) అధ్యక్షుడు తన ఒలింపిక్ కలను భగ్నం చేసేందుకు యత్నిస్తున్నాడని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆరోపించింది. ఈక్రమంలో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో...
రెజ్లింగ్ సమాఖ్య చీఫ్‌పై వినేశ్ ఆరోపణ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) అధ్యక్షుడు తన ఒలింపిక్ కలను భగ్నం చేసేందుకు యత్నిస్తున్నాడని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆరోపించింది. ఈక్రమంలో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనకుండా తనను అడ్డుకోవాలని చూస్తున్నాడని తెలిపింది. 50 కిలోల విభాగంలో ఒలింపిక్ బెర్త్ కోసం ఫొగట్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఈనెల 18 నుంచి కిర్గిస్థాన్‌లో జరిగే ఆసియా క్వాలిఫయింగ్ పోటీలలో పాల్గొనేందుకు సిద్ధమైంది. కానీ ఆ టోర్నీకి తన కోచ్, ఫిజియోకు అక్రిడిటేషన్ రాకుండా డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ సంజయ్ సింగ్ అడ్డుకున్నాడని వినేశ్ ఆరోపించింది. అంతేకాదు..తనను డోపింగ్‌లో ఇరికించే ప్రమాదమూ లేకపోలేదని ఫొగట్ చెప్పింది.