Share News

India A: ఉత్కంఠ మ్యాచ్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్

ABN , Publish Date - Oct 20 , 2024 | 07:01 AM

ఒమన్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 తొలి మ్యాచ్‌లో భారత్ వావ్ అనిపించింది. 7 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను జట్టును ఈజీగా ఓడించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

India A: ఉత్కంఠ మ్యాచ్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
India beat Pakistan 7 runs

ఎమర్జింగ్ టీమ్ ఆసియా కప్ 2024లో భారత్ ఏ(india A) జట్టు అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్ ఏని భారత్ సులభంగా ఓడించింది. శనివారం అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ తిలక్ వర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆ క్రమంలో భారత్ ఏ తరఫున ప్రధానంగా కెప్టెన్ తిలక్ వర్మ అత్యధికంగా 44 పరుగులు, ప్రభసిమ్రన్ 36, అభిషేక్ శర్మ 35, నేహాల్ వధేరా 25 రన్స్ చేశారు.


చివరి ఓవర్లో

ఇక ఆ తర్వాత ఆటకు దిగిన పాకిస్థాన్ ఏ జట్టు కూడా గెలించేందుకు ప్రయత్నించింది. కానీ 20 ఓవర్లలో ఈ జట్టు 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ ఏ జట్టు 7 పరుగుల తేడాతో పాకిస్థాన్ జట్టును ఓడించింది. భారత్ ఏ తరఫున యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్‌లో పాకిస్థాన్ ఏ జట్టుకు 17 పరుగులు అవసరం కాగా, తొలి బంతికే అబ్దుల్ సమద్‌ను అన్షుల్ కాంబోజ్ అవుట్ చేశాడు. దీంతో ఆ ఓవర్ తర్వాతి 5 బంతుల్లో అన్షుల్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి 7 పరుగుల తేడాతో టీమిండియాకు విజయాన్ని అందించాడు.


వాగ్వాదం

మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ, పాక్ బౌలర్ సుఫియాన్ ముఖీమ్ మధ్య వాగ్వాదం జరిగినప్పుడు సుఫియాన్ అభిషేక్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఆ క్రమంలో పాకిస్థాన్‌కు 7వ ఓవర్ వేయడానికి సుఫియాన్ వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే అభిషేక్ వికెట్ తీశాడు. అభిషేక్‌ ఔట్ అయిన తర్వాత సుఫియాన్ నోటిపై వేలు పెట్టి చూపించాడు. దీంతో అభిషేక్, సుఫియాన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో అంపైర్ జోక్యం చేసుకుని ఆపే ప్రయత్నం చేశాడు. పాకిస్థాన్ ఏ తరఫున సుఫియాన్ ముఖీమ్ గరిష్టంగా 2 వికెట్లు పడగొట్టాడు.


ఇరు జట్లు

ఇండియా ఏ జట్టులో తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, ఆయుష్ బడోని, నెహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిఖ్ దార్ సలామ్ మరియు వైభవ్ అరోరా ఉన్నారు.

పాకిస్థాన్ ఏ జట్టులో మహ్మద్ హారిస్ (వికె/కెప్టెన్), హైదర్ అలీ, యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సుఫియాన్ ముఖీమ్ కలరు.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 20 , 2024 | 07:03 AM