India vs Pakistan: త్వరలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. టిక్కెట్ ధర తెలిస్తే షాక్!
ABN , Publish Date - Mar 04 , 2024 | 11:37 AM
భారత్, పాకిస్థాన్(India vs Pakistan) క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా ఆ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నెల రోజుల తర్వాత జరగనున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
భారత్, పాకిస్థాన్(india vs pakistan) క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా ఆ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదనే చెప్పవచ్చు. అంతేకాదు ప్రపంచంలో ఏ మ్యాచుకు లేని క్రేజ్ దీనికి దక్కుతుంది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భారత్ తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో జూన్ 5న న్యూయార్క్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత జూన్ 9న భారత్, పాకిస్థాన్‌తో తలపడనుంది.
అయితే టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024)లో భారత్-పాకిస్థాన్‌ల(india vs pakistan) మ్యాచ్‌కు నెలరోజుల ముందు నుంచే సందడి నెలకొంది. ఈ మ్యాచ్‌కి టిక్కెట్లు కొనడం ప్రస్తుతం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఎందుకంటే భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ టిక్కెట్ల ధరలు ప్రస్తుతం బ్లాక్‌లో ఆకాశాన్నంటుతున్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: WhatsApp: వాట్సాప్ నుంచి త్వరలో క్రేజీ ఫీచర్..ఏమిటో తెలుసా?
ఓ వెబ్‌సైట్‌లో ఏకంగా 30 లక్షల రూపాయలకుపైగా విక్రయిస్తున్నట్లు తెలిసింది. అధికారికంగా మ్యాచ్ టిక్కెట్ల ప్రారంభ ధర రూ.497 మాత్రమే. కానీ ఈ టిక్కెట్ల(tickets) సంఖ్య చాలా తక్కువగా ఉంటాయి. దీని తర్వాత స్టాండర్డ్ కేటగిరీ టిక్కెట్ల ధర రూ.14 వేల నుంచి మొదలవుతుంది. అయితే చాలా వెబ్‌సైట్లు ఈ మ్యాచ్ టిక్కెట్లను బ్లాకులో లక్షల్లో విక్రయిస్తున్నాయని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే భారత్-పాక్ మ్యాచ్ కోసం వీఐపీ టికెట్(ticket) ప్రారంభ ధర(price) సుమారు 400 డాలర్లుగా ఉందని సమాచారం. మరో వెబ్‌సైట్‌లో దీనిని 40 వేల డాలర్లకు విక్రయిస్తున్నారని తెలిసింది. ఇక దీనిని ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు రూ.33 లక్షలు ఉంటుంది.
సీట్‌గీక్ పేరుతో ఒక అమెరికన్ వెబ్‌సైట్ ఉంది. క్రీడలతో పాటు ఇతర ఈవెంట్‌ల టిక్కెట్లు కూడా ఇందులో అమ్ముడవుతాయి. ప్రస్తుతం సీట్‌గీట్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కు రెండు టిక్కెట్‌లకు 179.5 వేల డాలర్లు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే టికెట్ ధర రూ.60-70 లక్షలుగా ఉంది.