మాకూ గుర్తింపునివ్వండి!
ABN , Publish Date - Mar 06 , 2024 | 05:59 AM
పురుషుల, మహిళల క్రికెట్‌లాగే తమను కూడా గుర్తించాలని అంధ క్రికెటర్లు బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. వారిలాగే తమకూ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తే బాగుంటుందని అన్నారు...

అంధుల క్రికెట్ జట్టు
న్యూఢిల్లీ: పురుషుల, మహిళల క్రికెట్‌లాగే తమను కూడా గుర్తించాలని అంధ క్రికెటర్లు బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. వారిలాగే తమకూ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తే బాగుంటుందని అన్నారు. ‘అంధుల క్రికెట్‌కు మరింత ఆదరణ దక్కాలంటే బీసీసీఐ గుర్తింపు తప్పనిసరి. అలా అయితేనే మేం ఉన్నత స్థాయికి ఎదగగలం. పాక్ అంధ క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టే వారు అద్భుతంగా రాణిస్తున్నారు’ అని భారత అంధుల క్రికెట్ జట్టు కోచ్ మహ్మద్ ఇబ్రహీం తెలిపాడు.