Hardik Pandya: రూ.4.3 కోట్లు మోసపోయిన హార్దిక్ పాండ్యా బ్రదర్స్..బంధువు చేతిలోనే
ABN , Publish Date - Apr 11 , 2024 | 03:29 PM
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన రోజులివి. కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులే మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో సాధారణ జనం..సెలెబ్రిటీలు అనే తేడానే లేదు. తాజాగా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. అతని సోదరుడు కృనాల్ పాండ్యా(Krunal Pandya) కూడా మోస పోయారు.
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన రోజులివి. కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులే మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో సాధారణ జనం..సెలెబ్రిటీలు అనే తేడానే లేదు. తాజాగా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. అతని సోదరుడు కృనాల్ పాండ్యా(Krunal Pandya) కూడా మోస పోయారు. సమీప బంధువే పాండ్యా బ్రదర్స్‌ను మోసం చేశాడు. ఏకంగా రూ.4 కోట్ల 30 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో హార్దిక్ సోదరులు పోలీసులను(police) ఆశ్రయించక తప్పలేదు.
ఇంతకీ అసలేం జరిగిందంటే 2021లో వరుసకు సోదరుడైన వైభవ్ పాండ్యా(Vaibhav Pandya)తో కలిసి కృనాల్ సోదరులు పాలిమర్ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఇందులో హార్దిక్ వాటా 40 శాతం. కృనాల్ పాండ్యా వాటా 40 శాతం. వైభవ్ పాండ్యా వాటా 20 శాతం. హార్దిక్, కృనాల్ ఇద్దరూ కెరీర్ పరంగా బీజీగా ఉన్నారు. క్రికెట్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. పాలిమర్ వ్యాపారం బాధ్యతలను వైభవ్ పాండ్యాకే అప్పగించారు. కొంతకాలం వ్యాపారం(business) సజావుగానే సాగింది. పెట్టిన పెట్టుబడుల ప్రకారం, ముగ్గురూ లాభాలను పంచుకునేవాళ్లు. కానీ ఆ తర్వాతే వైభవ్ ట్విస్ట్ ఇచ్చాడు.
సొంతంగా మరో వ్యాపారం మొదలు పెట్టాడు. అనుభవం ఉన్న పాలిమర్ రంగాన్నే ఎంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా-కృనాల్ పాండ్యాకు తెలియకుండానే వైభవ్ సొంత వ్యాపారం(business) మొదలు పెట్టాడు. ఇదే సమయంలో ముగ్గురు కలిసి మొదలు పెట్టిన వ్యాపారంపై దెబ్బ పడింది. బిజినెస్ తగ్గింది. మూడు కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పాండ్యా బ్రదర్స్‌కు చెప్పకుండానే వైభవ్ తన వాటాను పెంచుకున్నాడు. 20 శాతం నుంచి 30 వాతానికి వాటాను పెంచేసినట్టు కథనాలొస్తున్నాయ్..! అలర్ట్ అయిన పాండ్యా బ్రదర్స్..వైభవ్‌ను ప్రశ్నించారు.
కానీ పాండ్యా సోదరుల మీదే వైభవ్ రివర్స్ అయ్యాడట..! బెదిరింపులకు దిగినట్టుగానూ కథనాలొస్తున్నాయ్. ఎక్కువగా మాట్లాడితే పరువు తీస్తానని కూడా వైభవ్ వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. సమీప బంధువు ఇచ్చిన షాక్‌తో..పాండ్యా బ్రదర్స్ రూ.4 కోట్ల 30 లక్షలు మోసపోయారట. వైభవ్ మోసాన్ని గుర్తించిన పాండ్యా బ్రదర్స్.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో వైభవ్‌ను ముంబై పోలీసులు(mumbai police) అరెస్ట్ చేశారు. కేసుపై దర్యాప్తు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. నమ్మితే వైభవ్ ఇంత మోసం చేశాడా అంటూ హార్దిక్ అభిమానులు సోషల్ మీడియా(social media)లో ఫైర్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు. ఆటతో(sports) ఎంత బిజీగా ఉన్నా...అలర్ట్(alert)గా లేకపోతే..ఇలాంటి మోసాలే జరిగే ప్రమాదం ఉందంటున్నారు..! మరోవైపు ఈ చీటింగ్ వ్యవహారంపై పాండ్యా బ్రదర్స్ స్పందించలేదు. ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్‌ను హార్దిక్ లీడ్ చేస్తున్నాడు. కెప్టెన్‌గా సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. కృనాల్ పాండ్యా మాత్రం లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. ఎల్‌ఎస్‌జీకి కీలక ప్లేయర్‌గా మారాడు..!
ఇది కూడా చదవండి:
IPL Tickets: బ్లాక్‌లో ఐపీఎల్ టిక్కెట్ల విక్రయం.. 8 మంది అరెస్ట్
Olympic Games: పతకం నెగ్గితే.. రూ. 42 లక్షలు..
మరిన్ని క్రీడా వార్తల కోసం