Share News

‘ముస్తాక్‌ అలీ’ విజేత ముంబై

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:36 AM

రెండేళ్ల తర్వాత ముంబై జట్టు మరోసారి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఆ జట్టు 5 వికెట్లతో మధ్యప్రదేశ్‌పై గెలుపొందింది...

‘ముస్తాక్‌ అలీ’ విజేత ముంబై

బెంగళూరు: రెండేళ్ల తర్వాత ముంబై జట్టు మరోసారి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఆ జట్టు 5 వికెట్లతో మధ్యప్రదేశ్‌పై గెలుపొందింది. టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన ఎంపీ 20 ఓవర్లలో 174/8 స్కోరు సాధించింది. కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ (81 నాటౌట్‌) అదరగొట్టాడు. అనంతరం ముంబై 17.5 ఓవర్లలో 180/5 స్కోరు చేసి విజయం అందుకుంది. సూర్యకుమార్‌ (48), రహానె (37), సూర్యాంశ్‌ (36 నాటౌట్‌) మెరిశారు. ముంబై ఈ టైటిల్‌ గెలవడం ఇది రెండోసారి.

Updated Date - Dec 16 , 2024 | 05:36 AM