ఆర్‌సీబీ ప్లేఆ్‌ఫ్సకు..
ABN , Publish Date - Mar 13 , 2024 | 05:44 AM
డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే పేసర్ ఎలిస్ పెర్రీ (6/15) బెస్ట్ బౌలింగ్‌ను నమోదు చేయడంతో పాటు బ్యాటింగ్ (40 నాటౌట్)లోనూ చెలరేగింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సగర్వంగా...

ముంబైపై ఘన విజయం
నేటి మ్యాచ్
ఢిల్లీ X గుజరాత్, రాత్రి 7.30 గం. నుంచి
ఎలిస్ పెర్రీకి ఆరు వికెట్లు
మహిళల ప్రీమియర్ లీగ్
న్యూఢిల్లీ: డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే పేసర్ ఎలిస్ పెర్రీ (6/15) బెస్ట్ బౌలింగ్‌ను నమోదు చేయడంతో పాటు బ్యాటింగ్ (40 నాటౌట్)లోనూ చెలరేగింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సగర్వంగా ప్లేఆ్‌ఫ్సలో ప్రవేశించింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన ఆర్‌సీబీ.. 8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఓవర్‌కు రెండేసి వికెట్లతో చెలరేగిన పెర్రీ ధాటికి ముంబై బ్యాటర్లు చకచకా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 19 ఓవర్లలో ఆ జట్టు 113 పరుగులకే కుప్పకూలింది. సజన (30), హేలీ మాథ్యూస్ (26) మాత్రమే రాణించారు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆ తర్వాత స్వల్ప ఛేదనలో ఆర్‌సీబీ 15 ఓవర్లలో 3 వికెట్లకు 115 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు మంధాన (11), మోలినెక్స్ (9), డివైన్ (4) విఫలమైనా.. ఎలిస్ పెర్రీ (40 నాటౌట్) బ్యాట్‌తోనూ అదరగొట్టింది. రిచా ఘోష్ (36 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించడం విశేషం.
ఎలిస్ అదుర్స్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబైని పేసర్ ఎలిస్ ఓ ఆటాడుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు సజన, మాథ్యూస్ మెరుగ్గానే రాణించారు. ఆరో ఓవర్‌లో మాథ్యూ్‌సను డివైన్ అవుట్ చేసినా, పవర్‌ప్లేలో జట్టు 43 పరుగులతో పటిష్టంగానే కనిపించింది. కానీ ఆ తర్వాతే పెర్రీ షో ఆరంభమైంది. తన తొలి ఓవర్‌లో రెండు పరుగులే ఇవ్వగా.. అనంతరం వరుసగా వేసిన మూడు ఓవర్లలో సజన, హర్మన్ (0), కెర్ (2), అమన్‌జోత్ (4), వస్త్రాకర్ (6), సివర్ (10)ల పనిబట్టడంతో ముంబై చిగురుటాకులా వణికింది. ఇందులో నాలుగు బౌల్డ్, రెండు ఎల్బీలుండడం విశేషం. చివర్లో ప్రియాంక (19 నాటౌట్) ఆటతో స్కోరు వంద దాటింది.
సంక్షిప్త స్కోర్లు:
ముంబై: 19 ఓవర్లలో 113 ఆలౌట్ (సజన 30, మాథ్యూస్ 26; పెర్రీ 6/15) ;
బెంగళూరు: 15 ఓవర్లలో 115/3 (పెర్రీ 40 నాటౌట్, రిచా 36 నాటౌట్; మాథ్యూస్ 1/11)