Share News

Video: స్పెషల్ కేక్ కట్ చేసిన రోహిత్ శర్మ, కోహ్లీ, ద్రవిడ్.. అభిమానులకు ఆటోగ్రాఫ్స్

ABN , Publish Date - Jul 04 , 2024 | 11:59 AM

టీమ్ ఇండియా(team india) బృందం బార్బడోస్ నుంచి ఈరోజు ఉదయం 6.20 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ క్రమంలో రోహిత్ బృందానికి ఎయిర్ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత హోటల్లో టీమ్ ఇండియా జట్టు కోసం ఓ స్పెషల్ కేక్(Special Cake) తయారు చేయించారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video: స్పెషల్ కేక్ కట్ చేసిన రోహిత్ శర్మ, కోహ్లీ, ద్రవిడ్.. అభిమానులకు ఆటోగ్రాఫ్స్
Rohit and virat Kohli, Dravid cut special cake

టీమ్ ఇండియా(team india) బృందం బార్బడోస్ నుంచి ఈరోజు ఉదయం 6.20 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ క్రమంలో రోహిత్ బృందానికి ఎయిర్ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి టీమ్ ఇండియా ITC మౌర్య హోటల్‌కు చేరుకుంది. అక్కడ డప్పు చప్పుళ్లతో గ్రాండ్ వెల్ కం చెప్పారు.

ఈ క్రమంలోనే హోటల్లో టీమ్ ఇండియా జట్టు కోసం ఓ స్పెషల్ కేక్(Special Cake) తయారు చేయించారు. అది టీమ్ ఇండియా జెర్సీ, ఆటగాళ్ల చిత్రాలతో కేక్ పోలి ఉండటం విశేషం. కేక్ మొత్తం మూడు భాగాలుగా తయారు చేయబడింది. దిగువ భాగం నీలం, తర్వాత మధ్యలో పసుపురంగు, పై పొర తెలుపు రంగులో తయరు చేయించారు. పైభాగంలో చాక్లెట్‌తో చేసిన ట్రోఫీని అలంకరించారు. దానిపై 'అభినందనలు' అని కూడా రాసి ఉంది.


కేక్ కట్

ఆ క్రమంలో హోటల్లోకి వచ్చిన టీమిండియా జట్టులో ద్రవిడ్(rahul Dravid), రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ ప్రత్యేక కేక్‌ను కట్ చేశారు. దీంతో పాటు హార్దిక్ పాండ్యా కూడా కేక్ కట్ చేస్తూ కనిపించారు. రోహిత్ కేక్ కట్ చేసి జైషాకు తినిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేక్ కట్ చేసిన వెంటనే ఆటగాళ్లు ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం మీట్ జరుగుతోంది. వారు ఢిల్లీ నుంచి ముంబైకి మధ్యాహ్నం 2 PM షెడ్యూల్ చేసిన విమానంలో వెళ్లనున్నారు.


టీమ్ ఇండియా టైటిల్

జూన్ 29న, శనివారం బార్బడోస్ గడ్డపై భారత జట్టు 2024 (T20 World Cup 2024) టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో రోహిత్ అండ్ కంపెనీ దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు 2007లో టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తొలిసారి చాంపియన్‌గా నిలిచింది.


ఇది కూడా చదవండి:

Viral Video: టీమ్ ఇండియాకు డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం.. స్టెప్పులేసిన ఆటగాళ్లు


Viral Video: ఢిల్లీ చేరుకున్న T20 ప్రపంచ కప్ విజేతలు.. మోదీతో భేటీ తర్వాత

For Latest News and Sports News click here

Updated Date - Jul 04 , 2024 | 12:03 PM