Viral Video: టీమ్ ఇండియాకు డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం.. స్టెప్పులేసిన ఆటగాళ్లు
ABN , Publish Date - Jul 04 , 2024 | 09:46 AM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీమిండియా(Team India) రానే వచ్చింది. దాదాపు ఐదు రోజుల ఆలస్యం తర్వాత భారత జట్టు గురువారం కరేబియన్ దేశాల నుంచి న్యూఢిల్లీకి చేరుకుంది. ఆ క్రమంలో మౌర్య హోటల్ చేరుకోగానే ప్రపంచ ఛాంపియన్స్ కోసం పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్లతో ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఆటగాళ్లు డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీమిండియా(Team India) రానే వచ్చింది. దాదాపు ఐదు రోజుల ఆలస్యం తర్వాత భారత జట్టు గురువారం కరేబియన్ దేశాల నుంచి న్యూఢిల్లీకి చేరుకుంది. ఎయిర్ ఇండియా స్పెషల్ చార్టర్ ఫ్లైట్ AIC24WC బుధవారం ఉదయం 4:50 గంటలకు బార్బడోస్ నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం 6.20 గంటలకు న్యూఢిల్లీ(delhi)లో ల్యాండ్ అయింది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల పెద్ద ఎత్తున సందడి నెలకొంది. టెర్మినల్ 3 నుంచి మొదటగా విరాట్ కోహ్లీ బయటకు రాగా, కోహ్లీని చూసిన అభిమానులు పెద్ద ఎత్తున అరుపులు చేశారు.
ఆ క్రమంలోనే బయటకు వచ్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని పైకి ఎత్తి అభిమానులకు చూపించారు. ఆపై జట్టులోని మిగిలిన వారు వస్తూ ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. తర్వాత టీమ్ బస్సు ఎక్కి హోటల్ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. అభిమానులు వారిని అనుసరించారు. ITC మౌర్య హోటల్ వద్ద బస్సు దిగగానే, అక్కడ ప్రపంచ ఛాంపియన్స్ కోసం పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్లతో ఏర్పాట్లు చేశారు.
భారత బృందం నేరుగా ITC మౌర్య హోటల్‌కు చేరుకున్న తర్వాత వారికి డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం లభించింది. అదే సమయంలో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, జైస్వాల్, హార్దిక్ పాండ్యా సహా పలవురు ఆటగాళ్ల డప్పు చప్పుళ్లకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జూన్ 29న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగులతో ఉత్కంఠభరితమైన విజయం సాధించిన తర్వాత టీమిండియా బార్బడోస్‌లో తుపాను కారణంగా ఇండియాకు రావడం ఆలస్యమైంది. ఈరోజు రోహిత్ శర్మ అండ్ టీమ్ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసంలో 11 గంటలకు కలవనున్నారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత, T20 ప్రపంచ కప్ 2024 ఛాంపియన్లు ముంబైకి వెళ్లి ఓపెన్ బస్ విజయ పరేడ్‌లో పాల్గొంటారు. కవాతు అనంతరం వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఉంటుంది.
ఇది కూడా చదవండి:
Viral Video: ఢిల్లీ చేరుకున్న T20 ప్రపంచ కప్ విజేతలు.. మోదీతో భేటీ తర్వాత
Air Pollution: వాయు కాలుష్యం ప్రభావం.. ఈ నగరాల్లో 33 వేల మంది మృతి
For Latest News and Sports News click here