Rohit Sharma Catch: 0.45 సెకెన్ల క్యాచ్.. అద్భుత క్యాచ్ గురించి రోహిత్ శర్మ ఏమన్నాడంటే..
ABN , Publish Date - Feb 07 , 2024 | 06:54 PM
అశ్విన్ బౌలింగ్‌లో ఓలీ పోప్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ అద్భుతంగా ఒడిసి పట్టాడు. కేవలం 0.45 సెకెన్లలోనే రియాక్ట్ అయి అద్భుతంగా ఆ క్యాచ్ అందుకున్నాడు.

వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో (India vs England) టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్ ఓటమితో ఒత్తిడిలో పడిన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో (Vizag Test Match) అన్ని విభాగాల్లోనూ రాణించి సత్తా చాటింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుతంగా పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే తొలి టెస్ట్‌లో 196 పరుగులు చేసి టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఓలీ పోప్ (Ollie Pope) క్యాచ్ అది.
అశ్విన్ బౌలింగ్‌లో ఓలీ పోప్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ అద్భుతంగా ఒడిసి పట్టాడు. కేవలం 0.45 సెకెన్లలోనే రియాక్ట్ అయి అద్భుతంగా ఆ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ క్యాచ్ గురించి తాజాగా రోహిత్ శర్మ స్పందించాడు. ``స్లిప్‌లో ఉండే ఫీల్డర్లు ఎప్పుడూ ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండాల్సి ఉంటుంది. చాలా వేగంగా రియాక్ట్ కావాల్సి ఉంటుంది. ఓలీ పోప్ ఇంగ్లండ్‌కు చాలా కీలక బ్యాట్స్‌మెన్. అతడి క్యాచ్ పట్టడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అది మాత్రమే కాదు.. ఇకపై అలాంటి క్యాచ్‌లు ఎన్ని వచ్చినా పడతాన`ని రోహిత్ వ్యాఖ్యానించాడు.
రెండో మ్యాచ్‌లో గెలిచి టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌తో మిగతా మూడు టెస్ట్‌లకు సెలక్టర్లు జట్టును ప్రకటించాల్సి ఉంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వస్తే ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరంగా మారింది. రెండు టెస్ట్‌ల్లోనూ విఫలమైన శ్రేయాస్ అయ్యర్‌కు ఉద్వాసన తప్పేలా లేదు. అలాగే జస్ప్రీత్ బుమ్రాకు కుడా విశ్రాంతి ఇస్తారని వార్తలు వస్తున్నాయి.