ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సుమిత్
ABN , Publish Date - Dec 07 , 2024 | 06:06 AM
భారత టెన్నిస్ సింగిల్స్ టాప్ ఆటగాడు సుమిత్ నగాల్ వచ్చే ఏడాదిలో తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. నిరుడు క్వాలిఫయింగ్
మెల్‌బోర్న్: భారత టెన్నిస్ సింగిల్స్ టాప్ ఆటగాడు సుమిత్ నగాల్ వచ్చే ఏడాదిలో తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. నిరుడు క్వాలిఫయింగ్ రౌండ్లు ఆడిన సుమిత్.. ఈసారి మాత్రం నేరుగా చోటు దక్కించుకున్నాడు. వచ్చే జనవరి 12 నుంచి 26 వరకు జరిగే ఈ గ్రాండ్‌స్లామ్‌లో తలపడే క్రీడాకారుల జాబితాను టెన్నిస్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. పురుషులు, మహిళల సింగిల్స్ మెయిన్ డ్రాలో ఆడేందుకు ఆటగాళ్ల కటాఫ్ ర్యాంక్ 98. దీంతో ప్రస్తుతం సింగిల్స్‌లో 98వ ర్యాంక్‌లోనున్న సుమిత్.. ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించాడు. ఇక.. పురుషులు, మహిళల డిఫెండింగ్ చాంపియన్లుగా టాప్‌సీడ్లు సినర్, సబలెంకా బరిలోకి దిగనున్నారు.