Share News

పారా క్రీడల్లో తెలుగోళ్లకు 7 పతకాలు

ABN , Publish Date - Dec 07 , 2024 | 06:08 AM

ప్రపంచ ఎబిలిటీ పారా యూత్‌ గేమ్స్‌లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ఏడు పతకాలు కైవసం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్‌ ఐదు స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు

పారా క్రీడల్లో తెలుగోళ్లకు 7 పతకాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ ఎబిలిటీ పారా యూత్‌ గేమ్స్‌లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ఏడు పతకాలు కైవసం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్‌ ఐదు స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు నెగ్గగా, అందులో తెలుగోళ్లు ఏడు సాధించడం విశేషం. తెలంగాణ అథ్లెట్‌ దేవేంద్ర అండర్‌-17 షాట్‌పుట్‌, డిస్క్‌సత్రోలో రెండు పసిడి, 100 మీటర్ల స్ర్పింట్‌లో రజతం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శివాని అండర్‌-20 షాట్‌పుట్‌లో స్వర్ణం నెగ్గారు. ఇక అండర్‌-17 కేటగిరీ హైజంప్‌లో లోకేష్‌ స్వర్ణం, షాట్‌పుట్‌, డిస్క్‌సత్రోలలో సతీష్‌ రజతాలు సాధించారు.

Updated Date - Dec 07 , 2024 | 06:08 AM