Jasprit Bumrah: బుమ్రాను ఏం చేద్దాం?

ABN , First Publish Date - 2024-02-09T05:42:22+05:30 IST

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీ్‌సలో భారత్‌ తొలి టెస్టు ఓడినా.. రెండో టెస్టులో అద్భుత పోరాటం కనబర్చింది. పేసర్‌ బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో పర్యాటక జట్టును హడలగొట్టడంతోనే...

Jasprit Bumrah: బుమ్రాను ఏం చేద్దాం?

మూడో టెస్టుకు విశ్రాంతిపై మల్లగుల్లాలు

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీ్‌సలో భారత్‌ తొలి టెస్టు ఓడినా.. రెండో టెస్టులో అద్భుత పోరాటం కనబర్చింది. పేసర్‌ బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో పర్యాటక జట్టును హడలగొట్టడంతోనే విజయం దక్కింది. ప్రస్తుతం సిరీ్‌సలో 1-1తో నిలిచిన భారత్‌ పోటీని రసవత్తరంగా మార్చింది. అయితే మిగిలిన మూడు టెస్టుల కోసం జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే జడేజా గాయంతో, కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్‌ ఆడేది సందేహంగా మారింది. ఈనేపథ్యంలో పేసర్‌ బుమ్రాకు టీ20 వరల్డ్‌క్‌పనకు ముందు తగిన విశ్రాంతి కల్పిస్తే బావుంటుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా జరిగిన రెండు టెస్టుల్లో అతడు 57.5 ఓవర్లు వేసి 15 వికెట్లు తీయడం విశేషం. జట్టు కీలక బౌలర్‌ కావడంతో అతడిపై అధికంగా పనిఒత్తిడి పడకూడదనే భావనలో సెలెక్టర్లున్నారు. ఈ సిరీస్‌ తర్వాత ఐపీఎల్‌, అనంతరం టీ20 వరల్డ్‌కప్‌ వరుసగా ఉంటాయి. అంతేకాకుండా గాయాలతోనే దాదాపు 2022-23 ఏడాదంతా ఆటను మిస్‌ అయ్యాడు. అందుకే ముందుజాగ్రత్తగా రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టు నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారు. కానీ భారత స్పిన్నర్లను ఇంగ్లండ్‌ బ్యాటర్లు సులువుగా ఆడేస్తున్న వేళ.. అటు బుమ్రా కూడా జట్టులో లేకపోతే ఎలా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. అదీగాకుండా తను జట్టు వైస్‌కెప్టెన్‌. అనుభవజ్ఞుడు విరాట్‌ అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్‌ రోహిత్‌కు బుమ్రా అండ అవసరం. ఏదిఏమైనా రాజ్‌కోట్‌లో ఆడాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకునేందుకు బోర్డు పెద్దలు బుమ్రాకే పూర్తి అధికారం ఇచ్చినట్టు సమాచారం.

Updated Date - 2024-02-09T07:18:59+05:30 IST