Yashasvi Jaiswal: టెస్టుల్లో అదరగొడుతున్న కుర్రాడు..కోహ్లీ, గవాస్కర్ రికార్డులు బ్రేక్ చేస్తాడా?
ABN , Publish Date - Feb 21 , 2024 | 01:34 PM
భారత క్రికెట్ వర్ధమాన ఆటగాడు యశస్వి జైస్వాల్ తన ఆట తీరుతో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటివల ఇంగ్లండ్ జట్టుపై తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తన ఎదుట మరిన్ని క్రేజీ రికార్డులు ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చుద్దాం.
భారత క్రికెట్ వర్ధమాన ఆటగాడు యశస్వి జైస్వాల్(yashasvi jaiswal) తన ఆట తీరుతో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటివల ఇంగ్లండ్ జట్టుపై తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విశాఖపట్నం, రాజ్‌కోట్‌లలో జరిగిన మ్యాచుల్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసి యశస్వి రికార్డు సృష్టించాడు. కేవలం ఆరు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 109 సగటుతో 545 పరుగులు చేయడం ద్వారా ఈ సిరీస్‌లోనే టాప్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉంది.
ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో 700 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక భారతీయ బ్యాట్స్‌మెన్‌గా లిటిల్ మాస్టర్‌గా సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) పేరుగాంచారు. గవాస్కర్ ఈ ఫీట్‌ని రెండుసార్లు సాధించారు. 1970/71 వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అతను 774 పరుగులు చేశారు. 1978/79 సిరీస్‌లో అతను 732 పరుగులు చేశాడు. ఈ ఆల్ టైమ్ రికార్డును అధిగమించేందుకు జైస్వాల్ ఇంకా 229 పరుగులు చేయాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Sachin Tendulkar: విరాట్, అనుష్క జంటకు బేబీ బాయ్.. సచిన్ సహా ప్రముఖులు ఏమన్నారంటే
మరోవైపు 21వ శతాబ్దంలో ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక స్కోరు అయిన 692 పరుగుల విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డును కూడా అధిగమించాలని యశస్వి జైస్వాల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2016/17 హోమ్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై 655 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డును కూడా కలిగి ఉన్నాడు. తరువాతి రెండు ఇన్నింగ్స్‌లలో 110 పరుగులు చేసిన వెంటనే యశస్వి ఈ రికార్డును బద్దలు కొడతాడు. లేదంటే ధర్మశాలలో జరిగే చివరి టెస్టులో అతనికి ఇంకా ఒక ఛాన్స్ మిగిలి ఉంటుంది.
యశస్వి జైస్వాల్ కూడా వినోద్ కాంబ్లీతో పాటు 1000 టెస్ట్ పరుగులను(test runs) చేరుకున్న సంయుక్త వేగవంతమైన భారతీయ ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. కాంబ్లీ కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. కాంబ్లీ రికార్డును సమం చేయడానికి జైస్వాల్ తన తదుపరి ఇన్నింగ్స్‌లో 139 పరుగులు చేయాలి. మ్యాచ్‌ల పరంగా అతను భారతదేశం తరఫున అత్యంత వేగవంతమైన ఆటగాడు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన రెండవ ఆటగాడు అవుతాడు. భారత్‌లో ఈ రికార్డు ఛెతేశ్వర్ పుజారా పేరిట ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ రికార్డు డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. ఆస్ట్రేలియా ఆటగాడు బ్రాడ్‌మన్ 7 మ్యాచ్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఘనత సాధించాడు.