Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ 23 అల్ట్రా ఆఫర్‌తో మోసపోయిన జనం...ఆర్డర్లు రద్దు
ABN , Publish Date - Jan 11 , 2024 | 04:54 PM
లక్షా 25 వేల రూపాయలు ఉన్న Samsung Galaxy 23 Ultra స్మార్ట్ ఫోన్ రూ.75 వేలకే అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో ప్రకటించారు. కానీ తర్వాత కస్టమర్లు బుక్ చేసుకున్న ఫోన్ ఆర్డర్లను రద్దు చేశారు. అయితే ఎందుకు అలా చేశారో ఇప్పుడు చుద్దాం.
లక్షా 25 వేల రూపాయలు ఉన్న Samsung Galaxy 23 Ultra స్మార్ట్‌ఫోన్ రూ.75 వేలకే అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో ప్రకటించారు. అంతే అది తెలిసిన అనేక మంది వినియోగదారులు ఆ ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు బుక్ చేసుకున్నారు. కానీ తీరా కొన్ని గంటల తర్వాత అప్రమత్తమైన సంస్థ తమ వెబ్‌సైట్‌లో పొరపాటు జరిగినట్లు చెప్పింది. దీంతోపాటు ఆ ఫోన్లను బుక్ చేసుకున్న వాటిని కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Poco X6 series: నేడే పోకో X6 సిరీస్ ఇండియాలో లాంచ్..ధర, ఫీచర్లు చుశారా?
Samsung Galaxy 23 Ultra పోన్ Flipkart వెబ్‌సైట్‌లో అనుకోకుండా రూ.75,147కి ఆఫర్ ఉన్నట్లు నమోదైనట్లు తర్వాత కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా రూ.75,000కి అమ్మడం లేదని వెల్లడించారు. అయినప్పటికీ ఫ్లిప్‌కార్ట్‌లో Axis Bank, Bank of Baroda, IDFC First Bank, Yes Bank, One Cardల ద్వారా 10% వరకు తగ్గింపు ఇస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఇతర క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ.500 నుంచి రూ.2,500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా HDFC బ్యాంక్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌కు 9 నెలల వరకు నో కాస్ట్ EMI ఎంపిక కూడా ఉంగని చెప్పారు. దీంతో 9 నెలవారీ వాయిదాల్లో నెలకు రూ.11,111తో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఇక Samsung Galaxy 23 అల్ట్రా ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 5,000 mAh లిథియం బ్యాటరీ, 6.8 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 200 MP+10 MP+12 MP+10 MP వెనుక కెమెరా, 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.