Share News

Gmail Scam: జీమెయిల్ ఖాతా రికవరీ చేస్తామంటూ కేటుగాళ్ల స్కాం

ABN , Publish Date - Oct 14 , 2024 | 09:42 PM

సైబర్ స్కామర్లు ఇప్పుడు Gmailని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగించి వినియోగదారుల ఖాతాలను రికవరీ చేస్తామని మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Gmail Scam: జీమెయిల్ ఖాతా రికవరీ చేస్తామంటూ కేటుగాళ్ల స్కాం
recover gmail scam

మీరు కూడా Gmail ఉపయోగిస్తున్నారా. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు హ్యాకర్లు జీమెయిల్ ఖాతాలపై పడ్డారు. ఈసారి సైబర్ దుండగులు జీమెయిల్ హ్యాక్ చేసేందుకు ఏఐ అనే కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ క్రమంలో హ్యాకర్లు AI ద్వారా వినియోగదారులకు మీ ఖాతా రికవరీ చేస్తామని ఫేక్ సందేశాలు పంపిస్తున్నారు. వాటికి స్పందించి మీ వివరాలు చెబితే ఇంక అంతే సంగతులు. టెక్ నిపుణుడు, టెక్ బ్లాగర్ సామ్ మిత్రోవిక్ ఇటీవల తన బ్లాగ్ పోస్ట్‌లలో ఈ స్కామ్ గురించి తెలిపాడు.


స్కామ్ ఎలా పని చేస్తుంది?

ఈ స్కామ్ నోటిఫికేషన్ ద్వారా ప్రారంభమవుతుంది. ఈ నోటిఫికేషన్ అచ్చం Google వాస్తవ ఖాతా పునరుద్ధరణ నోటిఫికేషన్‌ మాదిరిగా ఉంటుంది. మీరు ఎప్పుడూ ప్రారంభించని Gmail ఖాతా పునరుద్ధరణ అభ్యర్థనను ఆమోదించమని మిమ్మల్ని అడుగుతూ ఓ నోటిఫికేషన్ మీ ఫోన్ లేదా ఇమెయిల్‌కు వస్తుంది. ఈ అభ్యర్థన తరచుగా మరొక దేశం నుంచి వస్తుంది. మీరు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లయితే, దాదాపు 40 నిమిషాల తర్వాత స్కామర్‌లు తదుపరి దశకు వెళతారు. ఆ క్రమంలో వారు కాల్ చేస్తారు. ఆ కాలింగ్ నంబర్ కూడా అధికారిక గూగుల్ నంబర్ మాదిరిగా కనిపిస్తుంది.


అమెరికన్ స్లాంగ్

ఈ వ్యక్తులు చాలా ప్రొఫెషనల్, మర్యాదపూర్వకంగా, అమెరికన్ యాసలో మాట్లాడతారు. మీ Gmail ఖాతాలో కార్యాచరణ గురించి మీకు తెలియజేస్తారు. మీరు విదేశీ, దేశం నుంచి లాగిన్ అయ్యారా అని వారు మిమ్మల్ని అడుగుతారు. ఆ విధంగా క్రమంగా మీతో మాట్లాడుతూ సమాచారం లాగుతారు. ఆ క్రమంలోనే మీ ఖాతా రికవరీ కోసం అభ్యర్థనను పంపిస్తున్నట్లు తెలుపుతారు. ఒకవేళ మీరు ఆ అభ్యర్థనపై క్లిక్ చేసి ఖాతా రికవరీ కోసం కొనసాగిస్తే మీ లాగిన్, పాస్‌వర్డ్‌ వంటి వివరాలను వారు దక్కించుకుంటా. ఆ తర్వాత మీ బ్యాంకు అకౌంట్లకు సంబందించిన సమాచారాన్ని హ్యాక్ చేసి లూటీ చేసే ఛాన్స్ ఉంది.


ఇలాంటి వాటి బారి నుంచి మీరు తప్పించుకోవాలంటే ఇలా చేయాలి

  • మీకు వచ్చే ఎలాంటి తెలియని అభ్యర్థనలను ఆమోదించవద్దు

  • మీరు సంబంధం లేకుండా వచ్చే రికవరీ నోటిఫికేషన్‌ను పొందినట్లయితే దానిని ఓపెన్ చేయకండి

  • మీరు గూగుల్ బిజినెస్ సర్వీస్‌లకు కనెక్ట్ చేయబడితే తప్ప Google చాలా అరుదుగా మాత్రమే వినియోగదారులకు కాల్ చేస్తుంది

  • మీరు అనుమానాస్పద కాల్‌ని స్వీకరిస్తే, ఆ ఫోన్ నంబర్‌ను నిర్ధారించుకోండి

  • స్పూఫ్డ్ ఇమెయిల్‌లు Google లాగా కనిపించవచ్చు, కానీ "To" ఫీల్డ్ లేదా డొమైన్ పేరు వంటి చిన్న వివరాలు నకిలీగా ఉంటాయి

  • మీ Gmail ఖాతా భద్రతా సెట్టింగ్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి

  • తెలియని లాగిన్‌లు లేవని నిర్ధారించుకోవడానికి ఇటీవలి కార్యకలాపాలను సమీక్షించండి

  • మీరు Gmail ఖాతా సెట్టింగ్‌లకు వెళ్లి "సెక్యూరిటీ" ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా దీన్ని చెక్ చేసుకోవచ్చు

  • మీ ఖాతాలో ఏదైనా అసాధారణ విషయాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి

  • ఏదైనా కమ్యూనికేషన్ గురించి తెలియకుంటే నేరుగా Googleని సంప్రదించడానికి వెనుకాడకండి


ఇవి కూడా చదవండి:

WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

For More Technology News and Telugu News

Updated Date - Oct 14 , 2024 | 09:44 PM