Share News

Air pollution: కాలుష్య కోరల్లో భాగ్యనగరం.. ఏ ప్రాంతంలో ఎంతుందో తెలుసా..

ABN , Publish Date - Nov 02 , 2024 | 05:41 PM

హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీపావళి ఎక్కడ చూసినా టపాసుల పేలుళ్లతో నగరం హోరెత్తిపోయింది. దీంతో ఓ వైపు గాలుష్యంతో పాటూ మరోవైపు శబ్ధకాలుష్యం కూడా పెరిగిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈసారి..

Air pollution: కాలుష్య కోరల్లో భాగ్యనగరం.. ఏ ప్రాంతంలో ఎంతుందో తెలుసా..

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీపావళి ఎక్కడ చూసినా టపాసుల పేలుళ్లతో నగరం హోరెత్తిపోయింది. దీంతో ఓ వైపు గాలుష్యంతో పాటూ మరోవైపు శబ్ధకాలుష్యం కూడా పెరిగిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 0% మేర ఎయిర్ పొల్యూషన్ పెరిగిందని స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది. గడిచిన 48 గంటల్లో నగరంలో గాలి నాణ్యత పూర్తిగా దిగజారింది. కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ సనత్ నగర్‌లో వాయు కాలుష్యం అధికంగా పెరిగినట్లు తెలిసింది.


ఈ కారణంగా గాలిలో ప్రమాదకర స్థాయిలో దుమ్ము ధూళి కణాలు, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కారకాలు పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 171కు పెరిగినట్లు తెలిపారు. క్వాలిటీ ఇండెక్స్ 60 పాయింట్లలోపు ఉండాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో పరిమితికి దాటిపోయింది. సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ, న్యూమలక్‌పేటలో 99, హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ వద్ద 92, జూపార్క్‌ వద్ద 91, కేపీహెచ్‌బీ ఫేజ్‌-2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లుగా నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరించింది.

Updated Date - Nov 02 , 2024 | 05:41 PM