Share News

Bhatti: ఝార్ఖండ్‌లో డిప్యూటీ సీఎం భట్టి

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:06 AM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు భట్టి విక్రమార్క.. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆర్జేడీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

Bhatti: ఝార్ఖండ్‌లో డిప్యూటీ సీఎం భట్టి

  • ఇండియా కూటమి పక్షాలతో సమన్వయ సమావేశం

న్యూఢిల్లీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు భట్టి విక్రమార్క.. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆర్జేడీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. శనివారం రాంచీలో జరిగిన ఈ భేటీలో... కాంగ్రెస్‌ ఆశిస్తున్న సీట్లపై మిత్రపక్షాలతో చర్చలు జరిపారు. తన తోటి సీనియర్‌ పరిశీలకులతో సమావేశమయ్యారు.


మరోవైపు రాంచీలో నిర్వహించిన సంవిధాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌లో పాల్గొనేందుకు వచ్చిన లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీకి భట్టి సాదర స్వాగతం పలికారు.

Updated Date - Oct 20 , 2024 | 03:06 AM