Share News

BJP: మూసీ సుందరీకరణ పేరుతో.. పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోం..

ABN , Publish Date - Oct 24 , 2024 | 09:59 AM

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే బీజేపీ(BJP) చూస్తూ ఊరుకోబోదని నిజామబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ(Nizamabad Urban MLA Dhanpal Suryanarayana) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

BJP: మూసీ సుందరీకరణ పేరుతో.. పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోం..

హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే బీజేపీ(BJP) చూస్తూ ఊరుకోబోదని నిజామబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ(Nizamabad Urban MLA Dhanpal Suryanarayana) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఇల్లు కోల్పోతున్న ప్రాంతంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. కిషన్‌బాగ్‌ డివిజన్‌లోని హౌసింగ్‌బోర్డుకాలనీలో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలను రోడ్డుపాలు చేస్తుండడం విచారకరమన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చెట్టే కదా అని కొట్టేస్తే.. చర్యలు తప్పవు..!


కేంద్ర ప్రభుత్వం గంగా ప్రక్షాళనకు కేవలం యాబై వేల కోట్లు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం మూసీ సుందరీకరణ కోసం లక్షా యాబై వేల కోట్లు కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకోబోతుందని ఆరోపించారు. సీనియర్‌ నాయకుడు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మూసీ పేరుతో పేదలను రోడ్డుపాలు చేయాలని చూస్తే ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ పార్టీని మూసీలో ముంచేయడం ఖాయమన్నారు. బీజేపీ పేదల పక్షాన ఉంటుందని, మూసీ బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉండి పోరాడుతుందని తెలిపారు.

city5.2.jpg


కాంగ్రెస్‌ నేత కన్నయ్యలాల్‌తో..

మూసీ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన బీజేపీ నాయకులు అదే బస్తీలో నివాసముంటున్న టీపీసీసీ కార్యదర్శి జి.కన్నయ్యలాల్‌తో మాట్లాడారు. జి.కన్నయ్యలాల్‌ ఇంటికి కూడా ఇటీవల అధికారులు మార్కింగ్‌ చేసిన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆయనతో ముచ్చటించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడివి.. దశాబ్దకాలంగా కాంగ్రెస్‌ పార్టీ జెండా మోస్తున్న నీలాంటి వారి ఇంటిని కూడా మీ ప్రభుత్వమే కూల్చివేస్తున్నది కదా అని సరదాగా అన్నారు. బీజేపీ నాయకుల మాటలను జి.కన్నయ్యలాల్‌ మౌనంగా వింటూ నిట్టూర్చాడు.


ఇదికూడా చదవండి: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఇదికూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ఇదికూడా చదవండి: Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2024 | 09:59 AM