TG News: కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
ABN , Publish Date - Jul 13 , 2024 | 03:29 AM
బీఆర్‌ఎ్‌సకు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఊహించినట్లుగానే రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో శుక్రవారంతన అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు.
సీఎం సమక్షంలో చేరిన బీఆర్‌ఎస్ సభ్యుడు
కాంగ్రెస్‌లో 8కి పెరిగిన గులాబీ ఎమ్మెల్యేలు
నేడు చేరనున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ
హైదరాబాద్/మియాపూర్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సకు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఊహించినట్లుగానే రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో శుక్రవారంతన అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల ముందే సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన ప్రకా్‌షగౌడ్.. అప్పుడే కాంగ్రె్‌సలో చేరాలని భావించారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో స్థానికంగా తన అనుచరగణం నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటు కూడా రాకపోవడం, పార్టీ మరింత బలహీనపడడంతో ప్రకా్‌షగౌడ్ పుననరాలోచనలో పడ్డారు.
మరోమారు తన అనుచరులతో సంప్రదింపులు జరిపి కాంగ్రె్‌సలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం ఉదయం తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకొని.. సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకుని కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరేందుకు రంగం సిద్ధం కాగా, ప్రకా్‌షగౌడ్ చేరిక పూర్తయింది. ఇక శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. కాంగ్రె్‌సలో చేరనున్నారు. మిగిలిన నలుగురు కూడా ఈ వారం లోపే చేరనున్నట్లు వర్గాలు తెలిపాయి. ముహూర్తాలు చూసుకుని చేరేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తి చూపుతుండడంతో ఒక్కొక్కరుగా చేరికలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి.
అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ శాసనసభాపక్షంలో విలీనం చేసుకునే వ్యూహంలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అందుకు అనుగుణంగా కసరత్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రకా్‌షగౌడ్ చేరికతో ఇప్పటిదాకా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలోకి సేఫ్‌గా ల్యాండ్ అవ్వాలంటే.. మూడింట రెండొంతుల మంది శాసనసభాపక్షంగా ఏర్పడి సీఎల్పీలో విలీనం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం 26కు తగ్గకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరిక అవసరం. దీంతో ఇంకా 18 మందిని చేర్చుకోవాల్సి ఉంటుందని, ఆ వెంటనే ఎమ్మెల్యేల విలీన ప్రక్రియ జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
నేడు హస్తం గూటికి అరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరనున్నారు. ఆయనతోపాటు పలువురు కార్పొరేటర్లు హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన అనుచరులు, ముఖ్యనాయకులు, కార్పొరేటర్లతో సమావేశమై ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. కాగా, శేరిలింగంపల్లి నుంచి గాంధీ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీ.. ఆ తరువాత బీఆర్‌ఎ్‌సలో చేరారు. అనంతరం 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో, ఇటీవల 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.
బీఆర్‌ఎ్‌సను అంతం చేయడం కాంగ్రె్‌సవల్ల కాదు: శ్రీనివా్‌సగౌడ్
ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్‌ఎస్ పని అయిపోయిందని ప్రచారం చేయడం తగదని, తమ పార్టీని అంతం చేయడం కాంగ్రెస్ వల్ల కాదని మాజీ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతలు మెతుకు ఆనంద్, పి.శశిధర్‌రెడ్డి, గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పరిజ్ఞానం లేనివారే.. బీఆర్‌ఎ్‌సకు ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదంటూ విమర్శలు చేస్తున్నారని, అసలు మోదీ కావాలా..? వద్దా..? అనే ప్రాతిపదికన లోక్‌సభ ఎన్నికలు జరిగాయని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీకే కాదు.. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 14 రాజకీయ పార్టీలకూ ఎంపీ సీట్లు దక్కలేదని పేర్కొన్నారు. పార్టీ మారుతున్నవారు తమ పదవులకు రాజీనామా చేసి.. మరోసారి గెలవాని, బీఆర్‌ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు.