Share News

Hyderabad: కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 ఫ్లైఓవర్లు.. 4 సబ్‌వేలు

ABN , Publish Date - Sep 06 , 2024 | 07:44 AM

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్‌ పార్కు(KBR Park) చుట్టూ ఆరు ఫ్లైఓవర్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించటమే లక్ష్యంగా ఫ్లైఓవర్‌లు(Flyovers) నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో పాదచారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా నాలుగు సబ్‌వేలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.

Hyderabad: కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 ఫ్లైఓవర్లు.. 4 సబ్‌వేలు

- ట్రాఫిక్‌ ఇక్కట్లు తగ్గించటమే లక్ష్యం

- మూడేళ్లలో రూ. 600 కోట్లతో పనులు

- త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు

హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్‌ పార్కు(KBR Park) చుట్టూ ఆరు ఫ్లైఓవర్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించటమే లక్ష్యంగా ఫ్లైఓవర్‌లు(Flyovers) నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో పాదచారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా నాలుగు సబ్‌వేలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. గడిచిన పదేళ్లలో కేబీఆర్‌ పార్కు చుట్టూ ట్రాఫిక్‌ రద్దీ భారీగా పెరిగిపోయింది. ట్రాఫిక్‌ పోలీసుల అంచనాల ప్రకారం గంటకు 40 వేల నుంచి 50 వేల వాహనాల వరకు రాకపోకలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. సెలవు రోజులు తప్పించి.. పని దినాల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది.

ఇదికూడా చదవండి: సాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టం 587.70 అడుగులు


దీంతో ట్రాఫిక్‌ నియంత్రణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌(Traffic signals)ను దాటేందుకు రద్దీ వేళల్లో ఐదారు నిమిషాల వరకు సమయం తీసుకుంటున్న పరిస్థితి. ఈ ప్రాంతంలో వీఐపీల రాకపోకలు ఎక్కువగా ఉండటం.. సెంట్రల్‌ సిటీ నుంచి ఐటీ నగరికి రాకపోకలు పెరిగిన నేపథ్యంలో.. లక్షలాది మంది తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా కొత్త ప్రతిపాదనల్ని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం. కేబీఆర్‌ పార్కు చుట్టూ అత్యంత రద్దీగా ఉన్న ఆరు ప్రాంతాల్లో ఫైఓవర్లను నిర్మించేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ఇందుకు రూ.500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల మధ్య ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.


city1.2.jpg

దీనికి సంబంధించిన కొన్ని డిజైన్లను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆరు ఫ్లైఓవర్లలో నాలుగు చోట్ల సబ్‌వేలు నిర్మించనున్నారు. ఫ్లైఓవర్ల మీదుగా వాహనదారులు సులువుగా ట్రాఫిక్‌ సిగ్నళ్లను అధిగమించేందుకు వీలుంటుందని చెబుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు వీలు ఉంటుందన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. అదే సమయంలో.. పాదచారులకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు సబ్‌వేలను నిర్మిస్తారు. దీంతో.. ట్రాఫిక్‌ సిగ్నళ్లను దాటే వేళలో ప్రమాదాల్ని నివారించే వీలుంటుందని అంచనా వేస్తున్నారు. రాబోయే పాతికేళ్లలో పెరిగే ట్రాఫిక్‌కు అనుగుణంగా ఫ్లైఓవర్లు, సబ్‌వేల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఫ్లైఓవర్లు.. సబ్‌ వేలకు సంబంధించిన కొన్ని డిజైన్లను సిద్ధం చేసినట్లుగా సమాచారం. అయితే.. వీటికి ఆమోదముద్ర పడాల్సి ఉంది. ఇక.. ఫ్లైఓవర్లు.. సబ్‌ వేలు ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండే ప్రాంతాల మీద కసరత్తు చేశారు.


ప్రాథమికంగా ఫ్లైఓవర్లను ప్రతిపాదించే ప్రాంతాలు

- సినీమ్యాక్స్‌ నుంచి కేబీఆర్‌ పార్కు చౌరస్తా దాటే వరకు.

- బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి నుంచి కేబీఆర్‌ పార్క్‌ చౌరస్తా వరకు.

- జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి జర్నలిస్టు కాలనీ రోడ్డు వరకు.

- ఫిలింనగర్‌ భారతీయ విద్యాభవన్‌ నుంచి జర్నలిస్టు కాలనీ వరకు ఒకటి, తాజ్‌ మహల్‌ హోటల్‌ వైపు మరొకటి (వి షేప్‌ లో)

- అగ్రసేన్‌ మహారాజ్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వరకు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 06 , 2024 | 07:44 AM