Share News

Hyderabad: ‘నిమ్స్‌’లో గుండె కవాటాల బ్యాంక్‌..

ABN , Publish Date - Oct 19 , 2024 | 09:54 AM

గుండె కవాటాల మార్పిడికి రూ. లక్షలు ఖర్చు అవుతాయి. సమయానికి దాతలు దొరకరు. బ్రెయిన్‌డెడ్‌(Brain dead) అయిన వారి నుంచే గుండె కవాటాలు సేకరించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో గుండె కవాటాలు అందుబాటులో లేక చాలామంది బాధితులు అవస్థలు పడుతున్నారు.

Hyderabad: ‘నిమ్స్‌’లో గుండె కవాటాల బ్యాంక్‌..

- త్వరలో అందుబాటులోకి

- పేదలకు ఉచితంగా మార్పిడి

హైదరాబాద్‌ సిటీ: గుండె కవాటాల మార్పిడికి రూ. లక్షలు ఖర్చు అవుతాయి. సమయానికి దాతలు దొరకరు. బ్రెయిన్‌డెడ్‌(Brain dead) అయిన వారి నుంచే గుండె కవాటాలు సేకరించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో గుండె కవాటాలు అందుబాటులో లేక చాలామంది బాధితులు అవస్థలు పడుతున్నారు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి నిమ్స్‌ ‘గుండె కవాటాల బ్యాంక్‌’ను సిద్ధం చేసింది. త్వరలో దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప నగరి తెలిపారు. కిడ్నీలు, గుండె, కాలేయం, కళ్లు, ప్యాంక్రియాస్‌ వంటి అవయవాల మాదిరిగానే బ్రెయిన్‌డెడ్‌ దాతల నుంచి గుండె కవాటాలను సేకరించనున్నారు. జీవన్‌దాన్‌(Jeevandan) సాయంతో సేకరించిన గుండె కవాటాలను ఇక్కడి ప్రత్యేక విభాగంలో భద్రపరచనున్నారు. అవసరమైన బాధితులకు గుండె కవాటాలను మార్పిడి చేయనున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రాంకీకి జీహెచ్‌ఎంసీ షోకాజ్‌ నోటీసు..


ప్రస్తుతం కృత్రిమంగా చేసిన కవాటాలే..

బ్రెయిన్‌డెడ్‌ రోగుల నుంచి గుండె కవాటాలను ఆశించిన స్థాయిలో సేకరించలేకపోతున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. దీంతో గుండె కవాటాలు అత్యవసరమైన రోగులకు కృత్రిమంగా తయారుచేసినవి అమరుస్తున్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో గుండె కవాటాలను మార్పిడి చేసుకోవడానికి రూ.50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు వ్యయం అవుతుంది అంత ఖర్చు భరించలేని పేదలు గుండె కవాటాల చికిత్సను పొందలేకపోతున్నారు.


ఇది వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ఈపరిస్థితిని నివారిస్తూ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా నిమ్స్‌లో కృత్రిమ గుండె కవాటాలను ఉచితంగా అమర్చనున్నారు. అయితే, కృత్రిమ కవాటాల మార్పిడి తర్వాత అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్‌ సోకితే ఇబ్బందులు తప్పవు. అదే బ్రెయిన్‌డెడ్‌ దాతల నుంచి సేకరించిన గుండె కవాటాలను సేకరించి మార్పిడి చేస్తే వంద శాతం మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నిమ్స్‌లో గుండె కవాటాల బ్యాంక్‌ ఇందుకు దోహదపడుతుందని బీరప్ప తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyberabad police: ఆర్‌జే శేఖర్‌ బాషా అరెస్టు..

ఇదికూడా చదవండి: High Court: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు రాధాకిషన్‌రావు

ఇదికూడా చదవండి: Bhupalpally: సింగరేణి ఓసీపీలతో దినదిన గండం!

ఇదికూడా చదవండి: Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 19 , 2024 | 09:54 AM