Share News

Hyderabad: డీసీపీపై బీజేపీ నేతల ఫిర్యాదు

ABN , Publish Date - May 08 , 2024 | 11:02 AM

ప్రచారం చేసుకునేవారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురావడమేమిటని ఫిర్యాదు చేసేందుకు కలిస్తే అసభ్య పదజాలంతో తిడుతూ బలవంతం గా వెళ్ల కొట్టాడని బీజేపీ నేతలు(BJP leaders) బోరబండ పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Hyderabad: డీసీపీపై బీజేపీ నేతల ఫిర్యాదు

హైదరాబాద్: ప్రచారం చేసుకునేవారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురావడమేమిటని ఫిర్యాదు చేసేందుకు కలిస్తే అసభ్య పదజాలంతో తిడుతూ బలవంతం గా వెళ్ల కొట్టాడని బీజేపీ నేతలు(BJP leaders) బోరబండ పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళ్తే.. మంగళవారం ఉదయం స్థానిక బీజేపీ నాయకులు బోరబండ డివిజన్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా, అనుమతులు లేకుండా ప్రచారం చేస్తున్నారని బోరబండ పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన డివిజన్‌ అధ్యక్షుడు కొత్త వెంకటేష్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అదే సమయంలో వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌(Westzone DCP Vijay Kumar) ఆకస్మిక తనిఖీ కోసం బోరబండ పోలీస్‌ స్టేషన్‌(Borabanda Police Station)కు వచ్చారు. డీసీపీ కనిపించగానే బీజేపీ నేతలు జరిగిన విషయం చెప్పేందుకు ఆయన వద్దకు వెళ్లి గుమ్మిగూడారు.

ఇదికూడా చదవండి: PM Modi: వేములవాడ, వరంగల్‌లో నేడు ప్రధాని మోదీ పర్యటన

దీంతో డీసీపీ విజయ్‌కుమార్‌ మీరంతా ఎవరూ ఇది పోలీస్‌ స్టేషన్‌ అనుకుంటున్నారా.. సంత అనుకుంటున్నారా.. అంటూ వీరిని బయటకు పంపాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపించారు. పోలీసులు గొంతు పట్టుకుని నెట్టారని తనకు దెబ్బ తగిలిందని కొత్త వెంకటేష్‌ ఆరోపించారు. ఈ విషయం తెలిసిన బీజేపీ నేతలు డాక్టర్‌ పద్మ వీరపనేని, వర్ధన్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్‌, కుంబాల గంగరాజు తదితర నేతలు బోరబండ పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం డీసీపీ, తమపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుని ఎన్నికల విధులను దూరంగా ఉంచాలంటూ డివిజన్‌ అధ్యక్షుడు కొత్త వెంకటేష్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సమస్యను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తామని వారు అన్నారు.

city4.jpg

ఇదికూడా చదవండి: Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ ఉండాలి

Read Latest Telangana News and National News

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 11:02 AM