Hyderabad: రైల్వే ట్రాక్ పునరుద్ధరణ.. రాకపోకలు ప్రారంభం
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:41 PM
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్(Raghavpur) సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దెబ్బతిన్న ట్రాక్‌ను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టడంతో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు గురువారం ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 11 వ్యాగన్లు బోల్తా పడి మూడు లైన్ల ట్రాక్‌తో పాటు విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి.
- గూడ్స్ రైలు ప్రమాద విచారణకు త్రిసభ్య కమిటీ
హైదరాబాద్ సిటీ: పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్(Raghavpur) సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దెబ్బతిన్న ట్రాక్‌ను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టడంతో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు గురువారం ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 11 వ్యాగన్లు బోల్తా పడి మూడు లైన్ల ట్రాక్‌తో పాటు విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. ఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్ ప్రధాన లైన్ కావడంతో 60కి పైగా రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి.
ఈ వార్తను కూడా చదవండి: TG NEWS: దెబ్బతిన్న హైదరాబాద్ బ్రాండ్.. సర్వేలో షాకింగ్ విషయాలు
పలు రైళ్లను పెద్దపల్లి, నిజామాబాద్(Peddapalli, Nizamabad) మీదుగా మళ్లించారు. ఘటనపై విచారణ జరిపేందుకు జీఎం అరుణ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. గూడ్స్ రైలు ఓవర్ లోడ్‌తో ప్రయాణించడం వల్లనే సంఘటన జరిగిందా, లేక రైల్వే ట్రాక్ కింది భాగంలోకి నీళ్లు పోయి కుంగిపోవడం వల్ల జరిగిందా, ట్రాక్ నిర్వహణ లోపాల వల్ల జరిగిందా అనే అంశాలపై విచారణ జరిపి నివేదికను రైల్వే మంత్రికి పంపించనున్నారు.
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ 9 గంటలకు పైగా ఆలస్యం
రాఘవాపురం- రామగుండం మధ్య రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బుధవారం రావాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ 9.30 గంటలు ఆలస్యంగా గురువారం ఉదయం 6 గంటలకు చేరుకుంది. రైళ్ల రీ- షేడ్యూల్‌కు సంబంఽధించి ముందస్తు సమాచారం లేకపోవడంతో స్టేషన్లకు చేరుకున్న ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ల(Secunderabad and Nampally railway stations)లో మరమ్మతులు కారణంగా కూర్చునేందుకు సరైన వసతులు కూడా లేక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.
ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే
ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు
ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ
Read Latest Telangana News and National News