Share News

Gandipet: హైడ్రాకు మద్దతుగా వాకథాన్‌

ABN , Publish Date - Aug 26 , 2024 | 04:29 AM

నగరంలో చెరువులను, నాలాలను ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు నగర పౌరులు మద్దతు పలుకుతున్నారు.

Gandipet: హైడ్రాకు మద్దతుగా వాకథాన్‌

  • సేవ్‌లేక్స్‌- సేవ్‌ లైఫ్‌ పేరుతో కార్యక్రమం

  • గండిపేట చెరువు వద్ద ప్లకార్డుల ప్రదర్శన

నార్సింగ్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలో చెరువులను, నాలాలను ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు నగర పౌరులు మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు ఆదివారం చారిత్రక గండిపేట జలాశయం వద్ద పెద్ద ఎత్తున వాకథాన్‌ నిర్వహించారు. గండిపేట వెల్ఫేర్‌ సొసైటీతోపాటు మరికొంత మంది స్వచ్ఛంద సంస్థలు, పలు కళాశాలల వారు వాకథాన్‌లో పాల్గొన్నారు. గండిపేట చెరువు వద్ద ‘సేవ్‌లేక్స్‌- సేవ్‌లైఫ్‌’ అంటూ హైడ్రాకు మద్దతుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిమాయత్‌సాగర్‌, గండిపేట ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అంతా కలిసి హైడ్రాకు మద్దతుగా నిలిచామంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. అలాగే గండిపేట సొసైటీ ఆధ్వర్యంలో సేవ్‌లేక్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన మంచినీరు కోసం నదులు, చెరువులు, నీటి వనరులను సంరక్షించుకోవాలని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి.చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. సీబీఐటీ కళాశాల సిబ్బంది, విద్యార్థులూ సేవ్‌ లేక్స్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2024 | 04:29 AM