Share News

Hyderabad: జూపార్కు నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణ భేష్‌..

ABN , Publish Date - May 26 , 2024 | 12:33 PM

జూపార్కు నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌ అలీ(Muhammad Shabbir Ali) అన్నారు. శనివారం ఆయన తన కూతురు, అటవీశాఖ ప్రభుత్వ న్యాయవాది షాజియా పర్వీన్‌ కుటుంబ సభ్యులతో కలిసి జూపార్కును సందర్శించారు.

Hyderabad: జూపార్కు నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణ భేష్‌..

- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

హైదరాబాద్: జూపార్కు నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌ అలీ(Muhammad Shabbir Ali) అన్నారు. శనివారం ఆయన తన కూతురు, అటవీశాఖ ప్రభుత్వ న్యాయవాది షాజియా పర్వీన్‌ కుటుంబ సభ్యులతో కలిసి జూపార్కును సందర్శించారు. వారికి క్యూరేటర్‌ డాక్టర్‌ సునీల్‌ ఎస్‌.హిరెమత్‌ స్వాగతం పలికారు. అనంతరం జూ నిర్వహణ, జంతువుల సంరక్షణ, జంతువుల పునరుత్పత్తి, దత్తత తదితర విషయాలను వివరించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఆలౌట్‌ తాగిన చిన్నారి.. ప్రాణాలు కాపాడిన వైద్యులు


అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సఫారీ పార్కు, పెద్దపులులు, నిశాచర జంతువుల ఎన్‌క్లోజర్లను పరిశీలించారు. అనంతరం షబ్బీర్‌ అలీ, షాజియా పర్వీన్‌ మాట్లాడుతూ జూపార్కు సహజసిద్ధంగా ఉందని, సందర్శకులకు వినోదంతోపాటు విజ్ఞానం కూడా అందుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ క్యూరేటర్‌ ఎ.నాగమణి, డిప్యూటీ డైరెక్టర్‌ (వెటర్నరీ) డాక్టర్‌ ఎం.ఎ హకీమ్‌, అసిస్టెంట్‌ క్యూరేటర్లు ఎ.సతీష్ బాబు, బి.లక్ష్మణ్‌, జూ సార్జంట్‌ ఎంఏ రహీమ్‌, ప్రజా సంబంధాల అధికారి హనీఫుల్లా తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 26 , 2024 | 12:33 PM