Share News

Congress: కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ABN , Publish Date - Jul 15 , 2024 | 08:02 PM

బీఆర్​ఎస్​ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లోకి వలస కడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చేరిన విషయం తెలిసిందే.

Congress: కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: బీఆర్​ఎస్ (BRS)​ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి (Congress) వలస కడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy ) ఈ రోజు (సోమవారం) కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్‌లో చేరినట్లు మహిపాల్ రెడ్డి తెలిపారు. మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ చేరారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు చేరారు. శాసనసభలో 75కి కాంగ్రెస్ సంఖ్య బలం చేరింది.


Mahipal-2.jpg

మహిపాల్‌రెడ్డి 2014 నుంచి పఠాన్ చెరులో వరసగా మూడుసార్లు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అనుచరులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత కొద్దిరోజులుగా మహిపాల్ రెడ్డి చేరిక వాయిదా పడుతూ వస్తోంది. రెండు రోజుల క్రితం ఆయన చేరాల్సి ఉన్నా పార్టీ నేతల అభ్యంతరంతో వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


ALSO Read: CM Revanth: పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

ఇప్పటికే కాంగ్రెస్‌లో అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్‌, దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌, కృష్ణమోహన్‌రెడ్డి, కాలేరు యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మరికొంతమంది ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి పలువురు త్వరలో హస్తం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.


అందుకే కాంగ్రెస్‌లో చేరా: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని అన్నారు. ఇన్ని రోజులు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పటాన్ చెరువు ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి తనను గెలిపించారని చెప్పారు.కచ్చితంగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నానని తెలిపారు. గత పదేళ్లు తనకు సహకరించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Komatireddy: ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ భారీ స్కాం.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

Madhuyashki: ఆ ఎమ్మెల్యేలకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.. మధుయాష్కీ షాకింగ్ కామెంట్స్

Chinna Reddy: తెలంగాణలో డిక్టేటర్స్ పాలన.. బీఆర్ఎస్‌పై చిన్నారెడ్డి ఫైర్

Tourists: వికారాబాద్‌లో టూరిస్టులకు వింత కష్టాలు!

Viral: వీడసలు మనిషేనా!? రైలు బయలుదేరగానే డోర్ పక్కన రాడ్ పట్టుకుని..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 09:14 PM