Aqua Tunnel: 600 రకాల చేపలతో అతి పెద్ద ఆక్వా టన్నెల్
ABN , Publish Date - Apr 24 , 2024 | 06:25 PM
కూకట్ పల్లి వై జంక్షన్ హుడా ట్రాక్ పార్క్ వద్ద దేశంలో అతిపెద్ద మెరైన్ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఇందులో 600 రకాల చేపలు ఉంటాయని నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇందులో స్కూబా డైవింగ్ కూడా ఉందని వివరించారు.
హైదరాబాద్: విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చేశాయ్. వారిని ఆకట్టుకునేందుకు ఆక్వా టన్నెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్, రాష్ట్రంలో గల మిగతా ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా ఆక్వా టన్నెల్ (Aqua Tunnel) ఏర్పాటు చేస్తున్నారు. కూకట్ పల్లి వై జంక్షన్ హుడా ట్రాక్ పార్క్ వద్ద దేశంలో అతిపెద్ద మెరైన్ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఇందులో 600 రకాల చేపలు ఉంటాయని నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇందులో స్కూబా డైవింగ్ కూడా ఉందని వివరించారు. స్కూబా డైవింగ్ గోవా లాంటి ప్రదేశాల్లో ఉండనుంది. ఇప్పుడు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చింది.
Read Latest Telangana News And Telugu News