Share News

Telangana Politics: గులాబీ బాస్ కీలక నిర్ణయం.. కేటీఆర్ ఔట్.. ఆ పదవి ఎవరికంటే..?

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:04 PM

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా రావడంతో గులాబీ బాస్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలకు ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. బీఆర్‌ఎస్‌ అధినేత వైఖరితో పాటు పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనంతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ లోపల, బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Telangana Politics: గులాబీ బాస్ కీలక నిర్ణయం.. కేటీఆర్ ఔట్.. ఆ పదవి ఎవరికంటే..?
KTR

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా రావడంతో గులాబీ బాస్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలకు ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. బీఆర్‌ఎస్‌ అధినేత వైఖరితో పాటు పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనంతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ లోపల, బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారపూరిత వైఖరి పార్టీకి నష్టం చేస్తుందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేటీఆర్‌ను పార్టీలో కీలక బాధ్యతల నుంచి మార్చాలని గులాబీ బాస్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ స్థానంలో కుటుంబంలోనే మరొకరికి కేటాయించాలా లేదా బయట వ్యక్తులకు అప్పగించాలా అనేదానిపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు హరీష్‌రావుకు అప్పగించాలని లేదంటే ఎస్సీ, బీసీ సామాజికవర్గాల నుంచి ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్నది ఎన్నికల కాలం కావడంతో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలిగే నాయకులు ఎవరనేదానిపై గులాబి బాస్ ఫోకస్ చేశారట. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ స్థానిక సంస్థల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవని.. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నుంచి పోటీ ఉంటుందని.. ఇద్దరి మధ్య పోటీని తట్టుకుని పార్టీని గెలుపువైపు తీసుకెళ్లగలిగే నాయకుడికి కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికొద్దిరోజుల్లోనే బీఆర్‌ఎస్ సంస్థాగత మార్పులు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Hyderabad: కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు పొన్నం శుభాకాంక్షలు


రేసులో ఎవరంటే..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను తప్పించి.. ఆ స్థానంలో హరీష్‌రావుకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీలో సీనియర్లకు ఎవరికైనా ఈ బాధ్యతలు అప్పగించవచ్చనే చర్చ లేకపోలేదు. ఓవైపు కుమార్తె కవిత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలులో ఉండటంతో.. ఈ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందనే కోణంలో కేసీఆర్ ఆలోచన చేస్తున్నారట. మరోవైపు హరీష్‌రావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించేందుకు సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి హరీష్‌కు బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.


ఫ్యామిలీ పాలిటిక్స్ అనే ముద్ర..

బీఆర్‌ఎస్‌పై ఫ్యామిలీ పార్టీ అనే ముద్ర పడింది. గత పదేళ్లలో కుటుంబ సభ్యులకు ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యమకారులకు, సామాన్య కార్యకర్తలకు ఇవ్వలేదనే వాదన ఉంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు కొంత ఇబ్బంది కలిగించిందనే చర్చ ఉంది. దీంతో ఆ ముద్రలు తొలగించుకోవడానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పార్టీ సీనియర్లలో ఒకరికి అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. సంస్థాగత మార్పుల్లో భాగంగా గులాబీ బాస్ పార్టీ కీలక బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో కొనసాగుతోంది.


Kishan Reddy: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా..: కిషన్ రెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jun 10 , 2024 | 03:18 PM