Share News

Raja singh: నిమజ్జనం వేళ అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:34 PM

Telangana: గణేష్ నిమిజ్జనంపై పోలీస్ కమిషనర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. గత నిమజ్జన సమయంలో చాలామంది మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించారని గుర్తుచేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియోస్ వైరల్ కూడా అయ్యాయని తెలిపారు. గణేష్ నిమజ్జనం సమయంలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Raja singh: నిమజ్జనం వేళ అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే
MLA Rajasingh

హైదరాబాద్, సెప్టెంబర్ 11: గణేష్ నిమిజ్జనంపై పోలీస్ కమిషనర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja singh) లేఖ రాశారు. గత నిమజ్జన సమయంలో చాలామంది మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించారని గుర్తుచేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియోస్ వైరల్ కూడా అయ్యాయని తెలిపారు. గణేష్ నిమజ్జనం సమయంలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. గణేష్ నిమజ్జన సమయంలో ఎవరు కూడా మద్యం సేవించవద్దన్నారు. భక్తి భావంతో నిమజ్జనం చేయాలన్నారు. మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపైన పోలీసులు చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలో పేర్కొన్నారు.


మధ్యాహానానికే మహా గణపతి నిమజ్జనం..

మరోవైపు.. ఖైరతాబాద్‌ బడా గణేషున్ని నిన్న (మంగళవారం) దర్శించుకున్న హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది జరిగినట్లుగానే ఖైరతాబాద్‌ గణేషుడి విగ్రహం నిమజ్జనాన్ని మధ్యాహ్నంలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఉదయం 6 గంటలకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేలా చేసి విగ్రహాన్ని తరలించడానికి సన్నాహాలు చేస్తామని, 70 అడుగుల భారీ విగ్రహాన్ని మధ్యాహ్నం 1:30లోపు నిమజ్జనం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.


ఇవి కూడా చదవండి..

Etela Rajender: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత

Bandi Sanjay: అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కేసీఆర్‌కు పట్టేది..

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 11 , 2024 | 04:43 PM