Dasoju Sravan: కొండా సురేఖ మాటలు వింటే అసహ్యం వేస్తోంది
ABN , Publish Date - Oct 03 , 2024 | 03:56 PM
Telangana: కొండా సురేఖ మాటలు రాజకీయాలు అంటే అసహ్యం వేస్తోందన్నారు. కొండా సురేఖ రాజకీయం కోసం సినిమా పరిశ్రమ వాళ్ళను అవమానించారన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళను తప్పుడు వ్యక్తులుగా మంత్రి చిత్రీకరించారన్నారు. కొండా సురేఖను రాహుల్ గాంధీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని..
హైదరాబాద్, అక్టోబర్ 3: అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ వ్యాఖ్యలను ప్రతీఒక్కరూ ఖండిస్తున్నారు. సినీ ప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ (BRS Leader Dasoju Sravan) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ మాటలు రాజకీయాలు అంటే అసహ్యం వేస్తోందన్నారు. కొండా సురేఖ రాజకీయం కోసం సినిమా పరిశ్రమ వాళ్ళను అవమానించారన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళను తప్పుడు వ్యక్తులుగా మంత్రి చిత్రీకరించారన్నారు. కొండా సురేఖను రాహుల్ గాంధీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
Pawan Kalyan: జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్
ఆ వివరాలు చెప్పాల్సిందే..
మంత్రి పొంగులేటి కుమారుడి చేతి వాచ్ వ్యవహారంలో ఈడీ రైడ్స్ జరిగాయని బీఆర్‌ఎస్ నేత అన్నారు. పొంగులేటి ఇంట్లో 1600 కోట్లు దొరికినట్లు ప్రచారం జరిగిందని.. బంగారం పెద్ద మొత్తంలో దొరికినట్లు తెలిస్తుందన్నారు. పొంగులేటి నివాసంలో ఏం దొరికిందో ఈడీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. లెక్కకు మించిన ఆదాయం దొరికితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. రైడ్స్ తర్వాత గౌతమ్ ఆదానీ, పొంగులేటి, సునీల్ కనుగోలు ఐటీసీ కోహినూర్‌లో భేటీ అయ్యారని తెలిపారు. గౌతమ్ ఆదానీని అడ్డం పెట్టుకుని ఈడీ కేసుల నుంచి పొంగులేటి బయటపడే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. బీజేపీతో అంటకాగే వ్యాపారవేత్తతో కాంగ్రెస్ నేతలకు ఏం పని అని అడిగారు. ప్రభుత్వపరమైన మీటింగ్ అయితే హోటల్‌లో ఎందుకు కలిశారని నిలదీశారు.
Cm Revanth Reddy: సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్ కార్డులు అవసరం
కాంగ్రెస్‌కు నష్టం కలిగేలా...
హైడ్రా విషయంలో హైకోర్టు హెచ్చరించినా సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. బీజేపీ గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారని అన్నారు. కేటీఆర్‌ను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావులపై దాడులు చేస్తామని మైనంపల్లి అంటున్నారన్నారు. మూసీ సుందరీకరణపై పాలసీ డాక్యుమెంట్ ఉందా అని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణపై పరివాహక ఎమ్మెల్యేలతో మీటింగ్ ఎందుకు పెట్టలేదని అడిగారు. జీహెచ్ఎంసీకి సంభంధం లేకుండా రేవంత్ రెడ్డి హైడ్రాను పెట్టుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారంటూ దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Janimaster: జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే
BRS: ఊహల నగరం కోసం హైదరాబాద్‌ను విస్మరిస్తారా?
Read Latest Telangana News And Telugu News